Homecinemaమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘గాడ్‌ఫాదర్‌’ టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘గాడ్‌ఫాదర్‌’ టీజర్‌

Telugu Flash News

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’ . మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మలయాళ నటుడు బిజు మీనన్ విలన్‌గా నటించనున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి అనుచరుడి పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. ఇక చిరుకి కుడిభుజంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. వీరిద్దరిపై ఓ ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించారు. తమన్‌ అందించిన మాస్‌ ట్యూన్‌ సినిమాకు హైలైట్‌.

దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ‘గాడ్‌ఫాదర్‌’ టీజర్‌ను ఒకరోజు ముందుగా ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో గడ్డంతో ఉన్న అగ్రెసివ్ లుక్ ఆకట్టుకుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఆచార్య’ తర్వాత చిరు చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

godfather teaser
godfather teaser

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్‌లో స్వల్ప మార్పులు చేశారు. అలాగే చిరంజీవి మేకోవర్‌లో కూడా మార్పు కనిపిస్తోంది. లక్ష్మీభూపాల చెప్పిన డైలాగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని వినికిడి. మరి ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి ఏ స్థాయి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని వార్తలు చదవండి :

ఇండస్ట్రీని ఈ స్థాయిలో ప్రేమిస్తానని అనుకోలేదు : సన్నీలియోన్

డీజే టిల్లు సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్..!

-Advertisement-

డీజే టిల్లు సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News