Telugu Flash News

Go First airline : రూ.1,199 కే ఫ్లైట్ టికెట్.. బంపర్ ఆఫర్.. వెంటనే బుక్ చేసుకోండి..

go first airlines

Go First airline flight ticket sale : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎందుకంటే విమాన టిక్కెట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ ఆఫర్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. మీ కోసం టిక్కెట్ ధరలపై తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.

గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ఇటీవలే ట్రావెల్ ఇండియా ట్రావెల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 16 నుండి ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా, మీరు తక్కువ ధరలో విమాన టిక్కెట్లను పొందవచ్చు.

కంపెనీ ఆఫర్ చేస్తున్న టిక్కెట్ ధరలపై ఈ తగ్గింపు ఆఫర్ జనవరి 19 వరకు అందుబాటులో ఉంది.కాబట్టి విమానంలో ప్రయాణించాలనుకునే వారు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు తక్కువ ధరలో విమాన టికెట్ పొందవచ్చు.

గో ఫస్ట్ ఎయిర్‌లైన్ ఆఫర్ ప్రకారం, విమాన టిక్కెట్ ధర రూ. 1,199 నుండి ప్రారంభమవుతుంది. దేశీయ విమాన ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. అదే అంతర్జాతీయ విమాన టిక్కెట్ ధర రూ. 6599 నుండి ప్రారంభమవుతుంది.

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే. పరిమిత సీట్లకు కూడా ఆఫర్ వర్తిస్తుంది.

కాబట్టి టికెట్ బుక్ చేసుకోవాలంటే వెంటనే చేయడం మంచిది. లేదంటే ఆఫర్ ఉండకపోవచ్చు. ఆఫర్‌లో భాగంగా 10 లక్షలకు పైగా సీట్లు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

అంతేకాకుండా, విమాన ప్రయాణికులకు కంపెనీ అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. రీషెడ్యూలింగ్ మరియు రద్దు ఉచితం. దీంతో ప్రయాణికులకు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.

‘మీ బ్యాగులు సర్దుకోండి. తక్కువ ధరలకే విమాన టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చాం. దేశీయ విమాన టిక్కెట్ రూ. 1199 ప్రారంభ ధర వద్ద పొందండి. అంతర్జాతీయ ప్రయాణ ఛార్జీలు రూ. 6599 నుంచి మొదలవుతుంది’ అని కంపెనీ ట్వీట్ చేసింది.

గత వారం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. బెంగళూరులో దాదాపు 55 మంది ప్రయాణికులను వదిలి విమానం బయలుదేరింది. ఈ క్రమంలో డీజీసీఏ చీఫ్‌ ఆపరేషన్‌ ఆఫీసర్‌కు గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రయాణికులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీసీఏ స్పందించింది. నోటీసులు పంపారు.

also read:

Horoscope Today : 17-01-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Fish and Milk : చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయా ?

Exit mobile version