Telugu Flash News

ginger health benefits : అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

ginger health benefits

ginger health benefits: రుచి కోసం మ‌నం వంట‌ల్లో నిత్యం వాడే అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌నే విష‌యం మీకు తెలుసా? సాధార‌ణంగా అల్లంను కూరల్లో రుచి, వాసన కోసం ఉప‌యోగిస్తుంటారు. అంతేకాదు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చేందుకు, వివిధ రకాల వ్యాధులను దరిచేరకుండా ఉండేందుకు అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంద‌ని నివేదిక‌లో వెల్ల‌డైంది.

వంటకాల్లో అల్లం వేయకపోతే రుచి ఎలాగైతే ఉండదో.. ఆరోగ్యం విషయంలో కూడా అల్లం తీసుకోకపోతే చాలా న‌ష్టాలు చ‌విచూస్తాం. ఇది యాంటి ఆక్సీడెంట్. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర ఎంతో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది.

అల్లం ఎంత మంచిదో తెలుసా?

కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యమైన‌న ఔషధంలా పని చేస్తుంది. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగితే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు బి3, బి6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు ఇతర పోషకాలు కూడా అల్లంలో ఉంటాయి.

అందుకే అల్లాన్ని రోజు తీసుకోవ‌డం వ‌ల‌న ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది.. దంత సమస్యలు, నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారికి అల్లం మంచి చిట్కాగా పని చేస్తుంద‌నే చెప్పాలి.

సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించేందుకు.. కూడా అల్లం దివ్యఔష‌దం.. అల్లం ముక్క తింటే చాలు చిన్న చిన్న సమస్యలు కూడా మ‌న ద‌రి చేర‌వు.

ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు త్వ‌ర‌గా తగ్గుతాయి. అల్లంను ఉపయోగించడం వల్ల పెరిఫెరల్ సర్క్యులేషన్ జ‌రుగుతుంది. మీరు వేడి వేడి అల్లం టీ తీసుకుంటే మెనుస్ట్రువల్ క్రాంప్స్ సమస్య త్వ‌ర‌గా తగ్గుతుంది.

క‌రోనా మహమ్మారి తర్వాత అల్లం వాడ‌కం ఎక్కువైంది. అల్లం సాగుతో వేలల్లో కాదు..లక్షల్లో సంపాదించొచ్చు. అల్లాన్ని శీతాకాలంలో తీసుకోవటం వల్ల మేలు జ‌రుగుతుంది. అదే వేసవి కాలంలో తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుంది.

 

Exit mobile version