Bigg Boss 6: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఆద్యంత ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం వస్తే ఫన్ డే అంటూ నాగార్జున సరదాగా గేమ్ ఆడించినప్పటికీ, చివరిలో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కంట కన్నీరు పెట్టిస్తాడు. ఇప్పటి వరకు హౌజ్‌మేట్ వెళితే తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవ్వడం చూశాం, కాని ఈ సారి గీతూ తాను ఎలిమినేట్ అయిన వేళ బిగ్ బాస్ వదిలి వెళ్లనని వెక్కి వెక్కి ఏడ్చింది. ఐ లవ్ యు బిగ్ బాస్.. నేను పోను బిగ్ బాస్ అంటూ గీతూ రాయల్ బోరున ఏడ్వడం.. వేదికపైకి వెళ్లిన తరవాత కూడా నాగార్జున ఎదుటే గుక్కపెట్టి ఏడ్వడం.. నేను పోను సార్ అంటూ కన్నరు మున్నీరుగా విలపించడం కొందరు ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది.
ఊహించని ఎలిమినేషన్
సన్ ఫన్ డే అంటూ గేమ్ సరదాగా ఆడించిన నాగార్జున అందులో గెలిచిన రేవంత్‌కి గిఫ్ట్ హ్యాంపర్ అందిచాడు. ఇక ఆ తర్వాత శ్రీసత్య, గీతూ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మిగిలడంతో వారిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అందరు ఎదురు చూస్తుండగా, వీరిలో గీతూ ఎలిమినేట్ అయ్యిందని ప్రకటించాడు. ఆమె ఎలిమినేట్ అయిందనే సరికి ఎవరు నమ్మలేకపోయారు. ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే రేవంత్ కన్నీరు పెట్టుకున్నాడు. ఫైమా, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి ఇలా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అయితే ఎలిమినేట్ అయిన వెంటనే ‘‘నా దగ్గరకు ఎవరూ రాకండి సామీ.. నాకు ఇష్టమైన ప్లేసెస్‌లో కాసేపు కూర్చొని వెళ్లిపోతాను’’ అని కాస్త ధైర్యంగా చెప్పిన గీతూ.. అవన్నీ తిరిగొచ్చి గార్డెన్ ఏరియాలో నిలబడి బోరున బోరున ఏడ్చేసింది.
ఐ లవ్ యు బిగ్ బాస్.. నా జీవితాంతం నిన్ను గుర్తు పెట్టుకుంటా బిగ్ బాస్.. నాకు ఇంకో లైఫ్ ఇచ్చినావ్ బిగ్ బాస్ అంటూ తెగ ఏడ్చేసింది.. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి పోను.. నాకు ఇక్కడే ఉండాలనుంది బిగ్ బాస్ అంటూ గుక్కపెట్టి ఏడవసాగింది. ఇప్పటి వరకు ఏ ఎలిమినేషన్ టైమ్‌లో కనిపించనంత నాటకీయత గీతూ ఎలిమినేట్ అయినప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో కనిపించడంతో అందరు అవాక్కయ్యారు. వేదికపైకి వెళ్లిన గీతూ తన ఏడుపు ఆపలేదు.. అసలు ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని.. తన మైండ్‌లో టాప్ 5 కూడా లేదని టాప్ వన్నే ఉందంటూ కాస్త అతి చేసి చూపించింది.
also read: