Telugu Flash News

Gautam Adani : అదానీ పతనం ఎక్కడిదాకా? బిలియనీర్ల లిస్టులో 22వ ప్లేస్‌కు పడిపోయిన గౌతమ్‌ అదానీ

Adani

ప్రపంచ కుబేరుల్లో దూసుకుపోతున్న బడా వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani).. హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌తో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకూ పడిపోతోంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతం చేసినప్పటి నుంచి అదానీ గ్రూప్‌ షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల జాబితాలో 22వ స్థానానికి అదానీ ర్యాంకు పడిపోయింది. మొన్నటిదాకా విజయవంతమైన వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే తనదైన మార్క్‌ వేసిన అదానీ.. ఇప్పుడు నేలచూపులు చూస్తున్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో అదానీ సామ్రాజ్యానికి దెబ్బ తగిలింది. ఇన్వెస్టర్లకు అపారనమ్మకం కలిగించిన అదానీ.. ఇప్పుడు ఎంత త్వరగా అమ్మేసుకుంటే అంత బెటర్‌ అనే విధంగా పరిస్థితి మారిపోయింది. ఇదంతా కేవలం హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌తో పది రోజుల్లోనే చోటు చేసుకుంది. అదానీ గ్రూప్‌ ఆర్థిక పరిస్థితి తలకిందులుగా మారిపోతోంది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసిన హిండెన్‌బర్గ్‌పై తర్వాత అదానీ గ్రూప్‌ వివరణ ఇచ్చుకున్నా ఫలితం తక్కలేదు.

అసలు అదానీ ఎలా మోసానికి పాల్పడుతున్నాడో హిండెన్‌బర్గ్‌ నివేదికలో బహిర్గతం చేశారు. షేర్‌ మార్కెట్‌లో అవకతవకలు చేయడం, కృత్రిమంగా షేర్ల విలువ పెంచుకోవడం, అకౌంటింగ్‌ మోసాలు, అవినీతి, మనీ ల్యాండరింగ్‌ లాంటి ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌.. అదానీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ కారణంగా కేవలం ఒక్క రోజులోనే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ.. ఇప్పుడు క్రమంగా దిగజారిపోతున్నారు.

ఈ ఏడాది జనవరి 26న మొదలైన అదానీ గ్రూపు షేర్ల పతనం.. ప్రస్తుతం కొనసాగుతోంది. షేర్లపై లోయర్‌ సర్క్యూట్‌ విధించాల్సిన దుస్థితి ఏర్పడింది. స్టాక్‌ మార్కెట్‌లో మార్కెట్‌ క్యాప్‌ 110 బిలియన్‌ డార్లకంటే ఎక్కువే నష్టపోయినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికాకు చెందిన స్టాక్‌ మార్కెట్‌ డోవ్‌ జోన్స్‌ తన జాబితా నుంచి అదానీ గ్రూప్‌ను తొలగించడం గమనార్హం. దేశీయంగానూ అదానీకి చిక్కులు వచ్చి పడుతున్నాయి. క్రెడిట్‌ సూయిస్‌, సిటీ గ్రూప్‌ లాంటి బ్యాకింగ్‌ దిగ్గజాలు అదానీ గ్రూప్‌కు బాండ్ల తాకట్టుపై లోన్లు ఇవ్వడం ఆపేశాయి. భవిష్యత్‌లో మరిన్ని కష్టాలు వెంటాడే అవకాశం కనిపిస్తోంది.

also read:

Ashika Ranganath Latest Photos, Images, Stills 2023

Pawan Kalyan: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండాల‌నుకున్నాడా..!

Exit mobile version