RRR: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ వస్తుందా రాదా అనే విషయం గురించే. తాజాగా తన ప్రవచనంలో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ‘నాటు నాటు’ పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చ తెలుగులో రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషించాల్సిన విషయమని చెబుతూ..ఆ పాటకు ఇద్దరు నటులు చేసిన అద్భుత నటనతో పాటు, కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ చాలా గొప్పది ని చెప్పారు.
ఇక ఆ పాట ఎందుకంత స్థాయికి వెళ్లిందో తెలుసుకోవాలి అని ఆ పాట వింటే అందులో ఒక్క ఇంగ్లిష్ మాట లేదు. ఇంత చక్కగా రాసిన చంద్రబోస్‌కి నమస్కారం. చాలా మంచి పాట రాశారు . ఇక నాటు నాటు పాటలో ఆ ఇద్దరి నటుల నటన అద్భుతం. ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు, ఇద్దరూ అలా కూడబలుక్కుని నటన చేయడం ఏదైతే ఉందో కవలలై పుట్టినవారికి కూడా సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు వారు. చిన్న వాళ్లు అయిన వారికి నమస్కరిస్తున్నాను అంటూ గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
also read :
samyuktha menon Latest stills, Images, Photos 2023
Panasa Pottu Pulihora curry : పనసపొట్టు, పులిహొర కూర
moral stories in telugu : అబద్ధం ఆడరాదు.. ఆడితే నష్టం తప్పదు