HomecinemaGangavva: సాఫ్ట్ వేర్ ఉద్యోగి క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్న గంగ‌వ్వ‌

Gangavva: సాఫ్ట్ వేర్ ఉద్యోగి క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్న గంగ‌వ్వ‌

Telugu Flash News

Gangavva: ఎవరిని ఎప్పుడు అదృష్టం త‌లుపు తడుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఒక్క‌సారి అదృష్టం త‌లుపు త‌ట్టిందంటే వారు కొద్ది గంట‌ల‌లోనే తెగ పాపుల‌ర్ అవుతుంటారు. మై విలేజ్ షోతో పాపులారిటీ ద‌క్కించుకుంది గంగవ్వ‌. ఆ త‌ర్వాత `బిగ్‌బాస్‌4` సీజన్‌లో పాల్గొని హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే కొన్నాళ్ల‌పాటు గేమ్ బాగానే ఆడిన కూడా, అనారోగ్యంతో హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ ద‌య‌వ‌ల‌న ఇటీవ‌లన హౌజ్ కూడా క‌ట్టుకుంది. ఈవిడ గురించి తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. మారుమూల పల్లె లో కూలి చేసుకునే వృద్థురాలు గంగ‌వ్వ సంపాదించే మొత్తం తెలిస్తే చాలా మంది ఆశ్చర్య‌పోతుంటారు.

ఎంత ఆదాయం అంటే..

యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేసే వారు ఎంత సంపాదిస్తారు అనేది చెప్ప‌డం ఇప్ప‌టికీ సస్పెన్స్. అయితే గంగ‌వ్వ ఎంత సంపాదిస్తుంద‌నేది చాలా మందికి తెలియ‌దు.

అయితే ఈమె సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ఒక్క రోజుకి పది వేల వరకు తీసుకుంటున్నారు. త్వరలోనే వంటల ఛానల్ కూడా ఆమె స్టార్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఏదో ర‌కంగా గంగవ్వ నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నారు అనే టాక్ వినపడుతుంది. త్వరలోనే ఒక సినిమాలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది.

ప‌ల్లెటూరు యాస‌లో గంగ‌వ్వ చెప్పే డైలాగులు ప్రేక్ష‌కుల కు ఎంత‌గానో న‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే గంగ‌వ్వ సినిమా ఆఫ‌ర్ ల‌ను కూడా అందుకున్నారు.

-Advertisement-

అంతే కాకుండా తన మై విలేజ్ షో యూట్యాబ్ ఛాన‌ల్ ద్వారా టాలీవుడ్ టాప్ హీరోల‌ను హీరోయిన్ లను గంగవ్వ ఇంట‌ర్వ్యూ చేసి అల‌రించిన విష‌యం విదిత‌మే. ఇటీవ‌ల బిగ్ బాస్ ఫేం గంగవ్వ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.

వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆయన సరదా వ్యాఖ్యలు చేయ‌గా, అవి వైర‌ల్ అయ్యాయి. తాను మహేశ్ బాబులా ఉన్నానని గంగవ్వ చెప్పిందని..ఈ మాట ఆయన వింటే ఫీల్ అవుతారని చమత్కరించి అంద‌రికి న‌వ్వులు తెప్పించాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News