Cheque Bounce Case : ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చెక్కు బౌన్స్‌పై వివాదం చెలరేగడంతో అది ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. మాజీ మంత్రి వినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు.
ప్రేమ్ సాగర్ చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశాడని వినోద్ కుమార్ ఫిర్యాదు చేశాడు.
గత ఎన్నికల సమయంలో రూ.25 లక్షలు తీసుకున్నారని, తిరిగి ఇవ్వాలని కోరగా చెక్కు ఇచ్చారన్నారు.
చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయిందని వినోద్ కుమార్ ఆరోపించారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తాజాగా వినోద్ కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు ఇప్పటికే కోర్టు నుంచి నోటీసులు అందాయి.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్‌కుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా బెల్లంపల్లి నుంచి శాసనసభకు పోటీ చేసిన వినోద్ కుమార్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్న వారిలో వినోద్ కుమార్ కూడా ఉన్నట్లు సమాచారం.
read more :
Jio Bharat 4G phone : రూ.999లకే జియో భారత్ 4జీ స్మార్ట్ ఫోన్