తాజా పండ్లను, కూరగాయాలను తినడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి మెరుగవ్వడానికి సీజనల్ ఫ్రూట్స్ (Immunity Boosting Fruits) తింటే చాలా మంచిది. ఈ సీజన్‌లో దొరికే ఐదు పండ్లను తింటే శరీరానికి చాలా మేలు చేసినట్లు అవుతుంది.
1. చెర్రీస్‌లో ఫైబర్, విటమిన్ సీ, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో దోహద పడతాయి.
2. స్ట్రాబెర్రీల్లో విటమిన్లు సీ, కే, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంతో పాటు శరీరంలోని మంటను తగ్గించడానికి సాయం చేసే యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
3. పైనాపిల్స్ తినడం వల్ల జీర్ణక్రియలో మంటను తగ్గించే ఎంజైమ్‌లను రిలీజ్ చేయడలో దోహదపడతాయి.
4. ఆప్రికాట్లు వసంత రుతువు చివరిలో దొరుకుతాయి. కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ ఏ ఉంటుంది.
5. కివీ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆక్టినిడిన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సాయం చేయడంతో పాటు జీర్ణశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయం చేస్తుంది.
also read:
Subbaraju: అక్రమ సంబంధాల గురించి నోరు విప్పిన సుబ్బరాజు
Amy Jackson : పిల్లాడు పుట్టాక ప్రియుడిని మార్చేసిన రజనీకాంత్ బ్యూటీ