ఫ్రాన్స్ మహిళా మంత్రి మార్లినే షియప్పా (Marlene Schiappa) తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ పేపర్ ప్లేబాయ్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మహిళా మంత్రి ఫొటో ఇటీవల ప్రచురితమైంది. దీంతో ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకొని వివాదాస్పదంగా మారింది.
ఫ్రాన్స్ ప్రభుత్వంలో సోషల్ ఎకానమీ, అసోసియేషన్స్ శాఖను మార్లినే నిర్వహిస్తున్నారు. తాజాగా ఆమె ప్లేబాయ్ పేపర్ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.అయితే, ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిజైనర్‌తో తయారు చేయించుకున్న డ్రెస్‌ను మార్లినే వేసుకున్నారు.
కానీ ఆమె వస్త్రధారణ విషయంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతోందంటూ విమర్శకులు పెదవివిరిచారు. ఈ ఫొటోలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలాసాబెత్ బోర్నే స్పందించినట్లు తెలుస్తోంది. మార్లినేను పిలిపించి దీనిపై మాట్లాడినట్లు సమాచారం. మీరు చేసిన పని సరైంది కాదంటూ మంత్రికి ప్రధాని హితవు పలికినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది.
ప్లేబాయ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సుమారు 12 పేజీల్లో ప్రచురితమైంది. మహిళలు, గే హక్కులు, అబార్షన్లు తదితర అంశాలపై మార్లినే సుదీర్ఘంగా మాట్లాడారు. మార్లినే ఇంటర్వ్యూ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడటం లేదు. ప్రధాని, వామపక్ష సభ్యులకు ఇది అస్సలు నచ్చలేదు. ఆమె తప్పు చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు మార్లినే మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. మహిళలకు తమ శరీరాలపై పూర్తి హక్కులు వారివేనని, వాటిని కాపాడుకోవాలన్నారు. ఏది కావాలన్నా వారు చేసేటట్లుగా ఉండాలన్నారు. తిరోగమన వాదులు, ఆత్మవంచకులు విసిగించడం సాధారణమేనని, ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్‌గా ఉండే మార్లినేను 2017లో ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls
— Jeanne Baron (@jeannebarontv) April 2, 2023
Also read :
Kerala train fire: కేరళలో దారుణం.. రైలులో ప్రయాణికుల మధ్య గొడవ.. తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి..
blue tick for free : ఉచిత ట్విటర్ బ్లూ టిక్ ! ఎవరికి, ఎందుకో తెలుసా?