Telugu Flash News

వారంలో నాలుగు రోజుల పనితో భారీ బెనిఫిట్స్‌.. అనేక దేశాల్లో ఫుల్‌ జోష్‌!

మనదేశంలో వారానికి ఎన్ని రోజుల పని అంటే టక్కున ఆదివారం మాత్రమే సెలవు కదా.. మిగతా రోజులన్నీ పని దినాలేనని చెబుతాం. ఇక ప్రైవేట్‌ సెక్టర్‌, ఐటీ సెక్టర్‌లో అయితే, వీకెండ్స్‌లో రెండు రోజులు సెలువులుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులైతే పబ్లిక్‌హాలిడేస్‌ ఉంటాయి. అయితే, చాలా దేశాల్లో ఇప్పుడు వారానికి నాలుగు రోజుల పని దినాలు అమలు చేస్తున్నాయట. ఈ విధానం ద్వారా ఉద్యోగుల హాజరు శాతం మెరుగుపడిందని తేలింది.

ఇప్పటికే వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని, షెడ్యూల్‌ను పలు దేశాలు ఆమోదించాయి. మరోవైపు యూఏఈ, స్పెయిన్‌, స్కాట్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌, జపాన్‌ దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని ఇంప్లెమెంట్‌ చేస్తున్నాయని తేలింది. ఈ కారణంగా కంపెనీల ఉత్పాదకతలో భారీ పెరుగుదల నమోదు చేసినట్లు వెల్లడైంది. దీనిపై తాజాగా యూఏఈ ప్రభుత్వం ఓ సర్వేను చేపట్టింది. అధ్యయనం ప్రకారం వీక్లీ ఫోర్‌ వర్కింగ్‌ డేస్‌తో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నట్లు తేలింది.

వారానికి నాలుగు రోజుల పనితో ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కంపెనీల ఉత్పాదకత పెరిగినట్లు గుర్తించారు. వృత్తిపరమైన సంతృప్తి, ఉత్పాదకత 90 శాతం పెరిగాయని తేలింది. ఉద్యోగుల్లో హ్యాపీనెస్‌ కూడా 91 శాతానికి చేరిందని తేలింది. వారానికి ఆరు లేదా ఐదు రోజుల పనితో అటు వర్క్‌ లైఫ్‌, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్‌ చేయలేక ఇబ్బందులు పడుతుంటారు.

ఈ నేపథ్యంలోనే వారానికి నాలుగు రోజుల పని దినాలు ఇంప్లిమెంట్‌ చేయడం వల్ల 84 శాతం మంది ఉద్యోగులు రెండింటినీ సమతూకం చేసుకోగలుగుతారని అధ్యయనంలో తెలిసింది. వీకెండ్‌లో సెలవులను ఆస్వాదించే వారు 95 శాతం మంది అని తేలింది. వారానికి నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించవచ్చని అధ్యయనం పేర్కొంది. ఖాళీ సమయంలో నచ్చిన పనులు చేసుకోవడం, హాబీస్‌, చదువు, ఇతర ప్రైవేట్‌జాబ్స్‌ లాంటివి చేసుకొనే వీలుంటుందని తేలింది.

also read : 

Viral video : అక్కడ డ్యాన్స్‌ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష.. ఇరాన్‌లో యువ జంటకు షాక్‌!

Vijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

 

Exit mobile version