Telugu Flash News

Share Market : ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో షేర్లు కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు!

Share Market : ఏప్రిల్‌లో విదేశీ ఇన్వెస్టర్లు షేర్‌ మార్కెట్‌ను షేక్‌ చేశారు. భారీగా కొనుగోళ్లు జరిపి రికార్డు సృష్టించారు. మొత్తంగా, ఏప్రిల్‌ మాసంలో గరిష్టంగా రూ.11,631 కోట్ల పెట్టుబడులు పెట్టి నెట్‌ బయ్యర్స్‌గా నిలవడం విశేషం.

గత నాలుగు నెలల్లో ఇది గరిష్ట మొత్తం కావడం గమనార్మం. విదేశీ ఇన్వెస్టర్లు నెట్‌ బయ్యర్స్‌గా ఉండడం వరుసగా ఇది రెండో నెల అని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ఐటీ రంగంలోని టెక్ దిగ్గజ కంపెనీల స్టాక్స్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఫారిన్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరిచారు. స్థూలంగా, ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ రూ.13,545 కోట్లు.

ఎఫ్‌పీఐల సాయంతో, ఏప్రిల్‌లో సెన్సెక్స్, నిఫ్టీ50 రెండూ మెరుగైన పనితీరును కనబర్చాయి. ఏప్రిల్‌ నెలలో సెన్సెక్స్ దాదాపు 2,121 పాయింట్లు లేదా 3.60 శాతం లాభపడింది.

నిఫ్టీ50 కూడా 705 పాయింట్లు లేదా 4.06 శాతానికి పైగా లాభపడటం విశేషం. ఎఫ్‌పీఐ కొనుగోళ్లతో 50 స్టాక్స్‌ ఉన్న నిఫ్టీ50 ఇండెక్స్‌ను 12 స్టాక్స్‌ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అధిగమించడం గమనార్హం.

గత నవంబర్‌లో ఫారిన్‌ ఇన్వెస్టర్ల రూ.36,239 కోట్ల పెట్టుబడి అనంతరం, మళ్లీ ఏప్రిల్ కొనుగోళ్లే అధికం కావడం చెప్పుకోదగ్గ పరిణామం.

also read :

Samyuktha Menon : విరూపాక్ష బ్యూటీ పెద్ద‌ మ‌న‌సు.. కాలేజ్ అమ్మాయిల కోసం ఏం చేసిందంటే..!

Chaitanya: కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య మృతితో ఎమోష‌న‌ల్ అయిన శ్ర‌ద్ధా, ర‌ష్మీ గౌతమ్

Exit mobile version