Viral Video: విద్యార్థుల జీవితాలపై ఉపాధ్యాయుడి ప్రభావం చాలా ఉంటుంది. ఒక విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవడానికి ఉపాధ్యాయుడు ఎంతగానో ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలో విద్యార్ధులు సైతం తమ గురువులని దైవంగా భావిస్తుంటారు. తాజాగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియోలో ఫ్లైట్ అటెండెంట్ ఎమోషనల్ అవుతూ కనిపించింది. 30 ఏళ్ల తర్వాత విమానంలో కలిసిన తన స్కూల్ టీచర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించింది. ఈ వీడియోను కియోనా థ్రాషర్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.దానికి కామెంట్ గా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్, ఉపాధ్యాయురాలు 30 ఏళ తర్వాత జరిగిన పునః కలయికని చూశాం అని రాశారు.
సూపర్ మూమెంట్..
ఇక వీడియోలో చూస్తే .. ఫ్లైట్ అటెండెంట్ లోరీ విమానం మైక్రోఫోన్‌లో మాట్లాడుతుంది . పాఠశాలలో తనకు బోధించిన ఓ’కానెల్ పట్ల ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తుంది. “ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మన జీవితమంతా మనకు ఇష్టమైన ఉపాధ్యాయులను గుర్తించాలి. నేను ఇప్పుడు ఉద్వేగానికి లోనవుతున్నాను, కానీ ఈ రోజు నేను నా గురువును చూశాను, ఓ’కానెల్ విమానంలో ఉన్నారు, అని చెప్పింది.వెంటనే, ప్రయాణీకులందరూ ఆమెకు చప్పట్లు కొట్టడం కనిపించింది. అనంతరం ఉద్వేగభరితమైన ఫ్లైట్ అటెండెంట్ ఇలా కొనసాగించింది.
“ఆమె నాకు ఇష్టమైన ఉపాధ్యాయురాలు. 1990 నుండి నేను ఆమెను చూడలేదు. ఆమె నన్ను షేక్స్‌పియర్‌ని ప్రేమించేలా చేసింది, నన్ను పియానో వాయించేలా చేసింది, నాకు పియానోలో మాస్టర్స్ ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ లోరీ తన గురువును కౌగిలించుకోవడానికి పరుగెత్తుతూ కనిపించింది. 75 సెకన్ల క్లిప్‌కి 10 లక్షల వ్యూస్ , 965 కామెంట్‌లు వచ్చాయి. ఈ వీడియో చూసి చాలా మంది విద్యార్ధులు కూడా తమ గురువుని తలచుకున్నారు. చక్కర్లు కొడుతున్న వీడియోకి
పలు కామెంట్స్ చేస్తున్నారు.