Telugu Flash News

జార్ఖండ్‌లో నడిరోడ్డుపై చేపల వాహనం బోల్తా.. పోలీసుల చేతివాటం.. పైగా లంచం డిమాండ్‌!

fishes on the road jharkhand

జార్ఖండ్‌ (jharkhand) లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేపల వెహికల్‌ (Fish Truck) బోల్తా పడటంతో నడిరోడ్డుపై చేపలన్నీ పడిపోయాయి. చుట్టుపక్కల వారు చాలా మంది రోడ్డుపైకి సంచులతో వచ్చేసి అందినకాడికి చేపలను పట్టుకుపోయారు. తర్వాత పోలీసులు ఎంటర్‌ అయ్యారు. వాహనంలో మిగిలిన చేపలను కూడా మాయం చేశారు. అనంతరం న్యాయం చేయకపోగా డ్రైవర్‌నే లంచం అడిగారు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌ ఇచ్చాడు డ్రైవర్‌.

సోషల్‌ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఇటీవల ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తుండడంపై పలు రకాలుగా వినియోగదారులు సాక్ష్యాలు బయట పెడుతుండడం తెలిసిందే. ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. కొందరు కెమెరాలను, సీసీటీవీలను పట్టించుకోకుండా లంచం తీసుకుంటూ దొరికిపోతుంటారు. ఈ ఘటనలో పోలీసులు కూడా ఇలా దొరికేశారు.

జార్ఖండ్‌ రాష్ట్రంలోని గిరిదిహ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వెస్ట్‌ బెంగాల్‌ నుంచి బిహార్‌కు చేపల లోడుతో వెళ్తున్న వాహనం ఈనెల 27న ఉదయం డుమ్రీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే కుల్గో టోల్‌ నాకా వద్ద బోల్తా పడింది. జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన జరగడంతో స్థానికులంతా చేతి వాటం చూపించారు.

సంచులతో వచ్చి సుమారు రెండు క్వింటాళ్ల వరకు చేపలను పట్టుకెళ్లారు. తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వాహనాన్ని, అందులో ఇంకా మిగిలి ఉన్న సుమారు 6 క్వింటాళ్ల చేపలతో సహా స్టేషన్‌కు తరలించారు.

తర్వాత కాసేపటికే అక్కడున్న చేపలన్నీ స్టేషన్‌ వద్ద మాయమైపోయాయి. వాహనాన్ని తీసుకెళ్లాలంటే మాకు పదివేల రూపాయలు ఇవ్వాలంటూ అక్కడి పోలీసులు డ్రైవర్‌ను డిమాండ్‌ చేయడంతో విస్తుపోయాడు డ్రైవర్‌ జితేంద్ర యాదవ్‌.

అయితే, చేసేదేమీ లేక ఫోన్‌పేలో ఆరు వేల రూపాయలు ఓ పోలీసు అధికారికి కొట్టాడు. తర్వాత నగదు రూపంలో ఓ నాలుగు వేలు ముట్టజెప్పాడు. అనంతరం అక్కడి నుంచి వాహనం వేసుకొని సీదా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న డ్రైవర్‌.. జరిగిన ఉదంతాన్నంతా వీడియో ఆధారాలు, ఫోన్‌పే స్క్రీన్‌షాట్లతో సహా ఎస్పీకి అందించి చర్యలు తీసుకోవాలని కోరాడు.

దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. న్యాయం చేయాల్సింది పోయి పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా కొందరు వ్యవహరించారని నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని చదవండి : 

Tarakaratna : ఇట్స్ మిరాకిల్.. తార‌క‌ర‌త్న విష‌యంలో అద్భుతం జరిగింద‌న్న బాల‌కృష్ణ‌

Telangana Budget 2023 : బడ్జెట్‌కు ఆమోదం తెలపని గవర్నర్‌.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?

Pawan Kalyan : ప‌వ‌న్, సుజీత్ సినిమా గ్రాండ్‌గా స్టార్ట్.. షాకింగ్ లీక్.. దానికి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!

 

Exit mobile version