Telugu Flash News

‘కృష్ణ వ్రింద విహారి’ అప్డేట్ ..మొదటి పాట ఎప్పుడంటే ?

krishna vrindha vihari song

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి , ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు. షిర్లీ సెటియా నాగ శౌర్య జోడీగా ఈ మూవీ లో నటించనుంది.

కృష్ణ వ్రింద విహారి మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ లోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ఏప్రిల్ 9 న మరియు సాంగ్ ప్రోమో రేపు ఏప్రిల్ 8 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ట్రాక్ కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ గా రానుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఐరా క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 22, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలు చదవండి :

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌..

మహేశ్ తో రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ.. ఆర్ఆర్ఆర్ ను మించి !

Exit mobile version