Telugu Flash News

Nampally Fire Accident : హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ పార్కింగ్‌లో ఐదు కార్లు దగ్ధం!

nampally fire accident

Nampally Fire Accident News : హైదరాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలోనే రెండు అగ్ని ప్రమాదాలు హడలెత్తించాయి. సికింద్రాబాద్‌లోని రామ్‌గోపాల్‌ పేట్‌ డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ భవనంలో అగ్ని ప్రమాద ఘటన మరువకముందే నాంపల్లి ఎగ్జిబిషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటనలో ఐదు కార్లు దగ్ధమయ్యాయి. పార్కింగ్‌ చేసిన కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రికల్‌ కారులో నుంచి మంటలు వచ్చాయి.

ఒక కారులో నుంచి వచ్చిన మంటలు నిమిషాల్లో చెలరేగాయి. ఇలా వ్యాపించిన మంటలతో పక్కనే ఉన్న మరో నాలుగు కార్లకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. హుటాహుటిన ఫైరింజన్లతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబిడ్స్‌ పోలీసులతో కలిసి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

వీకెండ్‌ కావడంతో ఎగ్జిబిషన్‌ పరిసరాల్లో భారీగా జనసందోహం చేరుకున్నారు. అగ్నిప్రమాదంలో భారీగా మంటలు, పొగలు రావడంతో అక్కడున్న ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆలిండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఎగ్జిబిషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది.

గత అనుభవాలతో పాఠాలు ఏవీ?

ఎగ్జిబిషన్‌కు ఏటా సుమారు 25 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. గతంలో 2019లో కూడా నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు పలు దుకాణాలు బూడిదయ్యాయి. సుమారు 30 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లింది. బాధిత వ్యాపారులకు ప్రభుత్వం ఆర్థికసాయం కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పార్కింగ్‌ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జనసందోహం భారీగా ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

also read news:

undavalli arun kumar : పవన్‌ కల్యాణ్‌ సీఎం అభ్యర్థి? ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు!

Rohit Sharma: మ‌తిమ‌రుపు రోహిత్ శ‌ర్మ‌.. పరీక్ష హాల్‌లో స్టూడెంట్ కూడా అంతేనంటూ మీమ్స్

Exit mobile version