HomecinemaManchu Family : రోడ్డున ప‌డ్డ మంచు ఫ్యామిలీ గొడవ.. స్పందించిన మంచు విష్ణు

Manchu Family : రోడ్డున ప‌డ్డ మంచు ఫ్యామిలీ గొడవ.. స్పందించిన మంచు విష్ణు

Telugu Flash News

Manchu Family: గ‌త కొద్ది రోజులుగా మంచు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుందంటూ అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మ‌నోజ్ రెండో పెళ్లికి మంచు విష్ణు చుట్ట‌పు చూపుగా వ‌చ్చి వెళ్లాడంటూ ప్రచారాలు కూడా సాగాయి.

కొన్నాళ్లుగా సైలెంట్‌గా న‌డుస్తున్న మంచు ఫ్యామిలీ గొడవ రోడ్డెక్కింది. సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి విష్ణు గొడవ పడ్డారు. ఈ క్ర‌మంలో విష్ణు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని.. తన బంధువులను కొడుతున్నడని ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు మనోజ్.

ఈ క్ర‌మంలో మంచు మ‌నోజ్ – విష్ణు మధ్య గొడవ రోడ్డున పడింది. తాజాగా ఈ వివాదం పై విష్ణు స్పందిస్తూ.. ఇద్దరి మధ్య సాధారణ గొడవే అని చెప్పుకొచ్చారు విష్ణు. సారథితో నా వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేక ఇలా వీడియో తీశాడు. మనోజ్ చిన్నవాడు, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు ఇది అని విష్ణు పేర్కొన్నాడు.

ఇక మంచు ల‌క్ష్మీ కూడా ఈ విష‌యంపై మాట్లాడుతూ.. మనోజ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ గురించి తనకు తెలియదు అని, ప్రస్తుతం బంధువులతో బిజిగా ఉన్నాను అని పేర్కొంది. ఇక మోహ‌న్ బాబు త‌న ఇద్ద‌రు కుమారులని పిలిపించి వారితో గ‌ట్టిగా చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

also read :

-Advertisement-

MLC 2023 : ఎమ్మెల్సీ గెలుపుతో టీడీపీకి బూస్ట్‌.. నేతల చేరికలు షురూ!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News