Fenugreek seeds: మెంతులే కదా అని మనం వాటిని చాలా లైట్ తీసుకుంటాం. కాని అవి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగించడమే కాక దీని వలన మోతాదుకు మించిన ఆహారం తీసుకునే ప్రమాదం ఉండదు. మెంతులు కొవ్వుని కరిగిస్తుంది.
రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఆ నీళ్లను తాగితే అజీర్తి సమస్య వస్తుంది. ఇక మెంతి గింజలను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పొడిలా చేసి పెట్టుకోవాలి.
బహు ప్రయోజనాలు..
పొడిని రోజు ఉదయాన్నే నీటిలో కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు అన్ని మటుమాయం అవుతాయి. రోజూ సాయంత్రం మెంతులని తీసుకున్నా కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు మెండుగా ఉపయోగపడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి బాడీలో ఉండే టాక్సిన్స్ ని బయటకి పంపిస్తాయి.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అదే, సమయంలో మంచి కొలెస్ట్రాల్ మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉంటాయి.
డయాబెటీస్ ఉన్నవారు మెంతుల్ని ఆహారంలో తప్పక చేర్చుకోవడం మంచిది. వీటిలో ఉండే ఎమైనో యాసిడ్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లో మనకు చాలా సహాయపడతాయి.
పీఎంఎస్ సమయంలో ఉండే అసౌకర్యాన్ని పోగొట్టడంలో మెంతులుఎంతగానో ఉపయోగపడతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
మెంతుల్లో ఉండే గెలాక్టోమెనన్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడగలుగుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన హార్ట్ రేట్ నీ, బ్లడ్ ప్రెజర్ నీ కంట్రోల్ చేస్తుంది.