Telugu Flash News

Thirumala : శ్రీవారి భక్తులకు ఫేక్‌ ఇక్కట్లు.. బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు!

TTD

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ తిరుమల (Thirumala) కు చేరుకుంటుంటారు. శ్రీనివాసుని సన్నిధికి వచ్చి పరవశిస్తుంటారు.

ఇలా వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ పద్ధతుల్లో దర్శనం కల్పిస్తోంది. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి సిఫార్సు లేఖలు పొంది దర్శనం చేసుకుంటారు.

మరికొందరు ఆన్‌లైన్‌లో టికెట్లు పొంది, చాలా మంది సర్వదర్శనం టోకెన్లు తీసుకొని, పలువురు కాలినడకన.. ఇలా దర్శనానికి వెళ్తుంటారు.

ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లు, గదులను బుక్ చేసుకునే భక్తులకు వెబ్‌సైట్లపై అవగాహన అవసరం. టీటీడీ వెబ్‌సైటే కదా అని ఏదో ఒక వెబ్ సైట్‌లో టికెట్లు, గదులు బుక్కింగ్ చేసుకుంటే ఇక సైబర్ మాయగాళ్ల వలలో పడిపోయినట్టే.

అవగాహన లేని భక్తులను సైబర్ మాయగాళ్లు టార్గెట్ చేసుకుని వివిధ రూపాల్లో దోచేస్తున్నారు. ఇలాంటి వెబ్‌సైట్లపై టీటీడీ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తోంది.

ఇప్పటికే దాదాపు 40కి పైగా నకిలీ వెబ్ సైట్లను టీటీడీ గుర్తించింది. వీటిపై గత వారంలో పోలీసులకు టీటీడీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉంది. దీన్ని మార్పులు చేస్తే భక్తులు విశ్వసించవద్దని టీటీడీ కోరింది.

also read :

Vikram : నుజ్జు నుజ్జు అయిన కాలు.. 23 స‌ర్జ‌రీలు చేయించుకున్నాడా..!

Samantha: స‌మంత దగ్గ‌ర ఉన్న చాలా ఖ‌రీదైన వ‌స్తువులు.. అవెంటో తెలుసా?

 

Exit mobile version