బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu Season 6) రసవత్తరంగా మారుతుంది. ఊహించని టాస్క్‌లు, అనుకోని ట్విస్ట్‌లు ఇస్తూ గేమ్‌ని చాలా రసవత్తరంగా మార్చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇవ్వగా ఇందులో రేవంత్, శ్రీహాన్, ఫైమాలు ఈ పాస్ కోసం తలపడ్డారు. ఎలాగైనా ఈ పాస్ సాధించి.. శ్రీసత్యను ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించాలని తెగ ప్రయత్నించిన శ్రీహాన్ ఆశలు అడియాలు అయ్యాయి.
మొదటిగా ఆదిరెడ్డి.. తన సపోర్ట ఫైమాకి అని చెప్పాడు. ‘గత టాస్క్‌లో రేవంత్.. ఇనయ విషయంలో అమ్మాయిని (ఇనయ) తప్పిస్తే టఫ్ తగ్గుతుంది కదా అని అన్నావ్.. ఇది నాకు నచ్చలేదు అని ఆది రెడ్డి అన్నాడు. ఆ మాటతో రేవంత్.. ఆ వీడియో అడుగు.. అని అన్నాడు. ‘ఆ వీడియో రాంగ్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా.. నిజం అయితే నువ్వు వెళ్లిపోతావా? అని రేవంత్‌కి సవాల్ చేశాడు ఆదిరెడ్డి.
ఫైమాకి ఫుల్ సపోర్ట్
జీవితంలో ప్రతిచోట మనం గెలవలేం.. ముందు ఓటమిని తీసుకునే శక్తి ఉండాలి అంటూ రేవంత్‌కి కాస్త హితబోధ కూడా చేశాడు ఆదిరెడ్డి. అయితే టాస్క్‌లో రేవంత్, శ్రీహాన్‌లు బరువైన కాడెలను మోస్తూ ఇచ్చిన పెర్ఫామెన్స్ అయితే మామూలుగా లేదనే చెప్పాలి. పాస్ ఫైమాకే అని ఫిక్స్ అయిన శ్రీహాన్.. కాడెని కిందపడేసి కుప్పకూలిపోగా, వెంటనే శ్రీసత్య. ..శ్రీహాన్‌ని ఒళ్లో పెట్టేసుకుని సపర్యలు చేసింది.. రేవంత్ కూడా చాలా సేపు బరువులు మోసి చివరకు గివ్ అప్ ఇచ్చాడు. దాంతో ఫైమాకి ఫ్రీ ఎవిక్షన్ పాస్ దక్కింది.
రేవంత్ కర్రపై దాదాపు 10 పైగా బ్యాగ్స్ ఉండడంతో బరువు మోయలేక కుప్పకూలిపోవడంతోనే ఈ టాస్క్ లో ఫైమా విజేతగా నిలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకుంది. మరి ఈ పాస్ తనకు వాడుకుంటుందా, లేకుంటే తనని సపోర్ట్ చేసిన ఎవరికైన ఉపయోగిస్తుందా అనేది రానున్న రోజులలో తెలియనుంది.
ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే ముందు శ్రీ సత్య అని చెప్పిన ఇప్పుడు మెరీనా పేరు వినిపిస్తుంది. ఎలిమినేషన్‌లో చాలా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.