Telugu Flash News

Fact Check : పెన్ను,పెన్సిల్ తో 2000, 500 నోట్లపై రాస్తే అవి చెల్లుతాయా ? ఇందులో నిజమెంత ?

writing on new currency notes

Fact Check : కొన్ని సంవత్సరాల క్రితం 10 రూపాయల కాయిన్లు మనుగడలోకి వచ్చిన విషయం అందరికి తెలిసే ఉంటుది.అవి వచ్చిన కొత్తలో అందరూ వాటిని బానే చేతులు మార్చుకున్నప్పటికీ తరువాత కొంత కాలానికి ఆ 10 కాయిన్లని బ్యాంకులలోనూ, బయట ఎవరూ స్వీకరించట్లేదని, వాటిని ఎవరూ తీసుకోవద్దని దుష్ప్రచారం మొదలైంది.

దీంతో భయపడిన జనం వాటిని తీసుకోవడం మానేయడమే కాకుండా వారి దగ్గర ఉన్న 10న కాయిన్లను వదిలించు కోవడం పనిగా చేసుకున్నారు.ఇలా మోసపూరితమైన దుష్ప్రచారంతో ఎక్కడ లేని భయం ప్రజలకు పట్టుకుంది.దీని పలితంగా 10 కాయిన్ల మనగడే ఎవరికీ కనిపించకుండా పోయింది.

ఇప్పటికీ బ్యాంకులలో వాటిని తీసుకోవచ్చని నోటీసుల అంటించి ఉన్నా సరే ఎవరూ పట్టించుకోరు. కనీసం ఎవరూ నమ్మరు.ఈ సంగతి ఇప్పుడెందుకు అంటారా… ఎందుకంటే ఇలాంటి పుకారు ప్రచారమే ఇంకొకటి ప్రస్తుతం ప్రజలను వెంటాడుతుంది.


2000,500,200,100 రూపాయల నోట్లపై పెన్నుతో కాని,పెన్సిల్ తో కాని రాస్తే అవి ఇక చెల్లవని ప్రజలలో వైరల్ గా ప్రచారం జరుగుతుంది. అయితే మునుపటి సంఘటనే మళ్ళీ పునరావృతం కాకూడదని భావించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పాక్ట్ చెక్ చేసి ఈ దుష్ప్రచారంపై ప్రజలకు స్పష్టతనిచ్చింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని చెబుతూ ఈ పుకారును కొట్టేసింది.

2000,500 సహా ఉన్న అన్ని రూపాయల నోట్లలో ఏ నోటపైన అయినా పెన్నుతో, పెన్సిల్ తో, సిరాతో రాసినా సరే అవి చెల్లుతాయని, దీనిపై ఎటువంటి సందేహం వద్దని పిబిఐ చెక్ చేసి వెల్లడించింది.

ఈ విషయాన్నే తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. అయితే ఇలా పేన్నుతో,పెన్సిల్ తో,సిరాతో నోట్లపై రాస్తే అవి చెల్లడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు కానీ వాటి మన్నిక తగ్గే అవకాశం ఉందని తెలిపింది. వీలైనంత వరకు వాటిపై ఏమి రాయవద్దని సూచించింది. ఈ విషయంపై పూర్తి మార్గ దర్శకాలను అర్బిఐ 2020లోనే జారీ చేసిందని వివరించింది.

అయితే ప్రతి సారి ప్రతి దాని మీద దుష్ప్రచారం పుట్టిస్తే తరువాత దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో ప్రజలకు స్పష్టత ఉండదు.కాబట్టి ఇలాంటి వాటిపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని కుదిరినంత వరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తే బావుంటుందని ప్రజలు భావిస్తున్నారు.

Also Read:

Shaakuntalam Telugu Trailer | శాకుంతలం తెలుగు ట్రైలర్

Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్ధిక తిప్పలను అధిగమిస్తుందా? లేక శ్రీలంకలా దివాళా దిశగా పయనిస్తుందా?

Exit mobile version