Telugu Flash News

Excessive Thirst : అతిగా దాహం వేస్తే ఈ లక్షణాలు ఉన్నట్లే.. వెంటనే అప్రమత్తం కావాలి!

Excessive Thirst

Excessive Thirst : కొందరికి అతిగా దాహం వేస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు నీరు తాగినా దాహార్తి తీరదు. ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అతిగా దాహం వేసే వారికి డయాబెటిక్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు. ప్రతి రెండు గంటలకోసారి నీరు తాగడం శరీరానికి మంచిది. కానీ, ఎక్కువ సార్లు నీరు తాగుతూ దాహం తీరలేదంటే అనుమానించాల్సిందే.

డయాబెటిక్‌ బారిన పడితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ప్రస్తుతం కరోనా వేళ ఇమ్యూనిటీ బూస్ట్‌ కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే, టైప్‌ 2 డయాబెటిక్‌ బారిన పడినా కూడా చాలా సంవత్సరాల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ, డైట్‌ ఫాలో అయితే ఇది సాధ్యమే.

ఇన్సులిన్‌ తయారు చేయడంలో పాంక్రిక్‌ విఫలమైనా, లేదంటే తయారైన ఇన్సులిన్‌ సక్రమంగా వినియోగించుకోలేకపోయినా ఆ పరిస్థితిని టైప్‌ 2 డయాబెటిస్‌గా పరిగణిస్తారు. ఇలాంటి స్థితిలో రక్తంలోని గ్లూకోజ్‌ శక్తిలో మార్పు రాదు. దీంతో శరీరంలోని గ్లూకోజ్‌ నిల్వలు పెరిగిపోయి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది.

డయాబెటిక్‌ లక్షణాలు ఇలా గుర్తించాలి..

డయాబెటిక్‌ సోకిందని తెలిపేందుకు కొన్ని లక్షణాలు శరీరంలో గమనించవచ్చు. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. త్వరగా అలసిపోతుంటారు. ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోకపోయినా బరువు తగ్గిపోతుంటారు. జననేంద్రియాల వద్ద దురదగా అనిపిస్తుంది. స్వల్ప గాయాలైనా మానిపోకుండా ఇబ్బంది పడుతుంటారు. కంటిచూపు మందగిస్తుంది. మరికొందరిలో చర్మంపై దురదలు ఏర్పడుతుంటాయి. నోరు ఎండిపోవడం.. ఈ క్రమంలో అతిగా దాహం వేయడం జరుగుతుంటాయి. నోటి దుర్వాసన కూడా వస్తుంటుంది. ఇలా జరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

also read :

David Warner : వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Exit mobile version