Telugu Flash News

Vladimir Putin: పుతిన్‌ గురించి సంచలన విషయాలు వెల్లడించిన మాజీ సైనికాధికారి!

vladimir putin

vladimir putin

Vladimir Putin latest news : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాది పూర్తి అయినా నేటికీ నానుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు శాంతి కోసం ప్రయత్నాలు చేసినా యుద్ధాన్ని అడ్డుకోలేకపోయాయి. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యవహార శైలి యుద్ధం ప్రారంభం నుంచి చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌ గురించి తెలుసుకొనేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు.

యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్‌ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంటోంది. ఆయన అనారోగ్యం గురించి పలుమార్లు పలు రకాలుగా వార్తలు వెలువడ్డాయి. ఇక పుతిన్‌ను అతని సన్నిహితులే హతమారుస్తారంటూ కొందరు జోస్యం కూడా చెప్పారు.ఇక పుతిన్‌ గురించి రష్యా ఫెడరల్‌ ప్రొటెక్షన్‌ సర్వీస్‌లో కెప్టెన్‌గా పని చేసిన గ్లెబ్‌ కారకులోవ్‌ కీలక విషయాలు వెల్లడించారు.

Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించిన కొన్ని ఆసక్తికర అంశాలు

తాజాగా మీడియాతో ఈ విషయాలను ఆయన పంచుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ రహస్య రైలు నెట్‌వర్క్‌లోనే ప్రయాణిస్తారని ఆయన ధ్రువీకరించారు. ఈ నెట్‌వర్క్‌ను ఎవరూ ట్రాక్‌ చేయలేరని స్పష్టం చేశారు. అందుకే దీన్ని ఎంపిక చేసుకొని ఉంటారన్నారు. పుతిన్‌ ఒక యుద్ధ నేరగాడిగా గ్లెబ్‌ అభివర్ణించారు.

నిరంతరం ప్రాణభీతితో ఉండే పుతిన్‌.. తన ప్రాణాలను రక్షించుకొనేందుకు తరచూ బంకర్లలో తలదాచుకుంటాడని తెలిపారు. సెల్‌ఫోన్‌గానీ, ఇంటర్నెట్‌గానీ పుతిన్‌ వాడరని గ్లెబ్‌ చెప్పారు. ఇక కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి పుతిన్‌ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని, నాటి నుంచి జర్నీలు, పబ్లిక్‌ ప్లేస్‌లలో కనిపించడం లాంటివి పూర్తిగా తగ్గించేశారని తెలిపారు.

Crimea : రష్యా ఉక్రెయిన్ యుధ్ధంలో క్రిమియాకు ఎందుకింత ప్రాధాన్యత?

పుతిన్‌కు సన్నిహితంగా మెలగాల్సి వచ్చిన వారు తప్పకుండా రెండు వారాల కఠిన క్వారంటైన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, సోచితోపాటు చాలా నగరాల్లో ఒకే తరహా ఆఫీసులను పుతిన్‌ ఏర్పాటు చేయించుకున్నాడన్నారు. విదేశాలకు చెందిన నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకు, తనపై జరిగే హత్యాయత్నాలను అడ్డుకొనేందుకు పుతిన్‌ ఇలా చేస్తున్నాడని గ్లెబ్‌ పేర్కొన్నారు.

పుతిన్‌ కోసం విమానాలు, హెలికాప్టర్లు, విలాస నౌకలు, బాంబు షెల్టర్లలో సీక్రెట్‌ కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఎవరీ గ్లెబ్‌ అనే సందేహాలు అందరికీ కలుగుతాయి. ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకించిన సైనికాధికారిగా గ్లెబ్‌ వార్తల్లో నిలిచారు. ఇతని తల్లిదండ్రులు పుతిన్‌కు సన్నిహితులు. దీంతో తల్లిదండ్రులు, పుతిన్‌తో బంధాన్ని తెగదెంపులు చేసుకొని దేశం దాటిన వ్యక్తిగా గ్లెబ్‌ నిలిచారు.

Exit mobile version