Telugu Flash News

Elon Musk : ఎలోన్ మస్క్.. ఎక్కడ చూసినా ఇతని పేరే.. అతని గురించి మీకు తెలుసా ?

elon musk and twitter

రియల్ లైఫ్ టోనీ స్టార్క్.. టెస్లా,స్పేస్- ఎక్స్,న్యూరా లింక్, ట్విట్టర్ లాంటి ఎన్నో కంపెనీలకు అధిపతి, ప్రపంచంలోనే అంత్యంత సంపన్నత కలిగిన వ్యక్తి ఏలోన్ మస్క్ (Elon Musk) . అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి, నలుగురికి తెలియచేయాలీ అంటే ఇది చదవాల్సిందే.

1971, జూన్ 28న సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీర్ అయిన ఏర్రల్ మస్క్ కి, మే మస్క్ కి జన్మించిన ఎలోన్ మస్క్ చిన్నప్పటి నుండి కంప్యూటర్ పై మిక్కిలి ఇష్టంతో ఎప్పుడూ దాని ముందే కూర్చునే వాడట.దాని నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవాడట.

ఆకరికి కోడింగ్ కూడా తనకు తానే నేర్చుకున్న మస్క్ 12 ఏళ్లకే “బ్లాస్టర్”అనే విడియో గేమ్ ని తయారు చేయడమే కాకుండా,దాన్ని అమ్మి ఐదు వందల డాలర్లని సంపాదించాడట.

18 ఏళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియాలో తన చదువును ముగించుకున్న మస్క్ ఆ తరువాత కెనడాకి చెందిన తన తల్లి ద్వారా అక్కడ పౌరసత్వం పొంది కెనడాకు తన నివాసాన్ని మార్చాడు.ఆ తరువాత కొన్నేళ్లకి యూనివర్సిటీ ఆఫ్ పెన్సల్వేనియా లో బ్యాచిలర్స్ డిగ్రీని (bachelor’s degree) అందుకున్నాడు.

ఎలోన్ మస్క్ (elon musk) జర్నీ:

1995లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడానికి కాలిఫోర్నియాకి మరోసారి తన నివాసాన్ని మార్చిన ఎలోన్ మస్క్ ఆ యూనివర్సిటీలో చేరిన రెండు రోజులకే బయటకి వచ్చేసాడు. ఆ తరువాత తన సోదరుడు కింబల్ తో కలిసి zip2 అనే ఒక సిటీ గైడ్ సాఫ్ట్వేర్(software) కంపెనీని స్థాపించాడు.

ఆ సంస్థ మంచి ఫలితాలనే అందించిన్నప్పటికీ 1999 లో zip2 కంపాక్ (compaq)అనే కంపెనీకి 307 మిలియన్ డాలర్లకు అమ్మేసి x.com అనే డైరెక్ట్ బ్యాంక్ వెబ్సైట్ ని వేరే ఒకరితో కలిసి ప్రారంభించాడు.ఆ తరువాత x.com ని కన్ఫైనిటీ (confinity) అనే మరో కంపెనీతో కలిపి దాన్ని 2000లో పే – పాల్ (pay-pal) గా మార్చాడు.

2002 ఈ పే- పాల్ కంపెనీని కూడా e-bay కి 1.5 బిలియన్ డాలర్లకి అమ్మేశాడు. ఇలా ప్రతి దశలో కొత్త మార్పులకు పూనుకుంటూ, అంచంలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఎలోన్ మస్క్ ఆ తరువాత సంవత్సరాలలో స్పేస్ -ఎక్స్,టెస్లా,న్యూరాలింక్, బోరింగ్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప కంపనీలను స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

ఈ ఏడాది ఎవరూ ఊహించని రీతిలో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ని సొంతం చేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.

ఇలా ప్రతి క్షణం అందర్నీ ఆశ్చర్య పరుస్తూ,న్యూస్ హెడ్ లైన్స్ లో నిలుస్తూ ఎలోన్ మస్క్ ఇక మీద ఇంకెన్ని కంపెనీలను స్థాపిస్తాడో….ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి మరి.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version