Elaichi Benefits:యాలకులు మన కిచెన్‌లో తప్పక ఉంటుంది. దీని వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థని మెరుగు పరుస్తాయి. క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా చేస్తాయి.
డిప్రెషన్‌తో బాధపడే వాళ్లు పాలలో కొద్దిగా యాలికలు వేసుకుని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కడుపులో మంట, నొప్పి వంటివి యాలకుల వలన తగ్గి పోతాయి.
సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి . యాలకల పొడి పాలల్లో వేసుకుని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది.
చాలా ప్రయోజనాలు…
- యాలకుల వలన పలు సమస్యలు నయం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉంటే ఆకు పచ్చ యాలకులు తీసుకోవడం మంచిది.
- బీపీని కంట్రోల్ చేయడానికి కూడా యాలకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. యాలుకలలో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయి అని పరిశోధనలో తేలింది.
- హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా యాలకుల వలన తొలగిపోతాయి. ఇవి గుండె సమస్య, డయాబెటిస్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- యాలకులు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
- నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కావిటీస్, చిగుళ్ల వ్యాధులను నియంత్రిస్తుంది.
- ఆయుర్వేదం ప్రకారం యాలుకలు తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
- చిన్న యాలకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 1, బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర కొవ్వును కరిగించడమే కాకుండా ఫైబర్, కాల్షియం బరువును నియంత్రిస్తుంది.
-Advertisement-