Egg yolk Nutrition and benefits : గుడ్డులోని పచ్చసొన తినడానికి చాలా మంది భయపడతారు. కోడిగుడ్డు పచ్చసొనలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని, చాలా మంది దానిని పక్కన పెడుతుంటారు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగి రక్తనాళాలు మూసుకుపోయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, అలాగే ఊబకాయం సమస్య వస్తుందని అనుకుంటారు. అయితే ఇది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కోడి గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో కొవ్వులు ఉన్నప్పటికీ, ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పచ్చసొన తినకపోవడం వల్ల కోలిన్, సెలీనియం, జింక్ మరియు విటమిన్లు ఎ, బి, ఇ, డి మరియు కె వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పోతాయి. గుడ్లు బి కాంప్లెక్స్ మరియు విటమిన్ డి యొక్క ప్రధాన మూలం.
పచ్చసొనలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరం సులభంగా గ్రహించబడుతుంది. అదేవిధంగా గుడ్లలో ఉండే లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి సమస్యలను నివారిస్తుంది.
అంతేకాదు, గుడ్డులోని పోషకాలు అనేక జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి తింటే బరువు పెరుగుతారని బాధపడకండి. మీరు మొత్తం గుడ్డును సురక్షితంగా తినవచ్చు.
also read :
coriander leaves benefits : కొత్తిమీర తో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు !
Eggshells : గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమే!
Weight loss Tea : ఈ టీ తాగితే బరువు తగ్గుతారని మీకు తెలుసా ?