remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..
- ఉలవలను రుబ్బి మూలవ్యాధి మొలకలపై వేసి కట్టుచున్నచో పిలకలు ఊడిపడగలవు.
- దానిమ్మకాయ పై బెరడు ఎండించి మెత్తగా దంచిన పొడిని 1 చెంచా ఉదయం, సాయంత్రం తేనెతో తీసికొనినచో మూల వ్యాధి తగ్గి రక్తస్రావము ఆగిపోవును.
- ఉల్లికోళ్ళు కూరగా వండుకొని తినినచో పైల్సు తగ్గిపోగలవు. కరక్కాయ చూర్ణము పావుతులము, బెల్లపు పొడి తులము కలిపి రోజుకు రెండుసార్లు తీసికొనిన 15 రోజులలో మూలవ్యాధి నయముకాగలదు. (పథ్యం తీసుకొనదగినవి : క్యారెట్టు, తోటకూర, కొత్తిమీర, మజ్జిగ, మగ్గిన అరటిపండు, చన్నీటి స్నానము),
- గుప్పెడు వేప చిగురు రుబ్బి దానిలో కొమ్ములు ఎండబెట్టి కొట్టిన పసుపు 2 చెంచాలు వేసి కుంకుడు గింజంత మాత్రలు చేసికొని రోజుకు ఒక మాత్ర చొప్పున తీసుకొనిన మూల శంఖ త్వరగా తగ్గిపోవును.
- ముల్లంగి దుంపల రసము 50 నుండి 100 మి.గ్రా. లో కాస్త పంచదార వేసుకొని ఉదయము, సాయంత్రములందు తీసికొనిన మొలల తీవ్రత, బాధలు చాలా వరకు తగ్గును.
- ఒక నిమ్మచెక్కకు తగినంత ఉప్పు అద్దుకొని బుగ్గన పెట్టుకొని రసము మ్రింగుచుండిన నెల రోజులలో మొలల వ్యాధి అద్భు తముగా తగ్గును.