ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు (ED Notices) జారీ చేయడంతో ఆమెకు ఉచ్చు బిగుస్తోంది. నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
అయితే, ఇప్పటికే ఆమె షెడ్యూల్ ప్రకారం అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గురువారం విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. తాజాగా శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానని ఇప్పటికే కవిత ప్రకటించారు.
మహిళా బిల్లు ఆమోదం కోసం నిరసన తెలపడంలో భాగంగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేందుకు కవిత సిద్ధమవుతున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలు పార్టీల నేతలు, మహిళా సంఘాలను ఇన్వైట్ చేశారు.
కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి ముందస్తు షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని కవిత పేర్కొన్నారు. దీంతో విచారణపై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ నేపథ్యంలో తనకు కొంత గడువు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరారని తెలుస్తోంది. తాజాగా బుధవారం సాయంత్రమే కవిత దేశ రాజధానికి పయనమయ్యారు. ఇప్పటికే గురువారం ఉదయం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది.
అయితే, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలున్నందున దీనిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై బీఆర్ఎస్ నేతలతో పాటు న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరిపారు. అయితే, ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో శుక్రవారం ధర్నా కచ్చితంగా నిర్వహించి తీరుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. పిళ్లై విచారణ మరో వారం రోజుల పాటు కొనసాగనుంది. దర్యాప్తు వేగవంతంలో భాగంగా కవితకు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో రేపు ఢిల్లీలో ఏం జరగనుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
also read :
Allu Arjun: అల్లు అర్జున్, సందీప్ రెడ్డి మూవీకి టైటిల్ ఫిక్స్..!
kitchen tips (08-03-2023) : ఈ 9 వంటింటి చిట్కాలు మీ కోసం..
vastu tips : వాస్తు సమస్యలు – ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?
Rakul Preet Singh bikini Photos | Travel + Leisure Photoshoot
Ashika Ranganath Latest Photos, Images, Stills 2023