వరి, గోధుమ, ఇతర ధాన్యాలు, తెల్లగా పాలిష్ పట్టకుండా తిన్నట్లయతే మంచి ఆరోగ్యం. ఎందుకంటే బియ్యం పై పొరలో ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. బియ్యము తెల్లగా పాలిష్ పడి ఈ విటమిన్లు పోయి కేవలము పిండిపదార్థము మిగులుతుంది. ఉప్పుడు బియ్యము కూడా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే పాక్షికంగా ఉడికించడమువల్ల పొట్టులో ఉండే ముఖ్యమైన బి-కాంప్లెక్స్, విటమిన్లు గింజ లోపలి భాగానికి వెళతాయి. అందుకని ఆరోగ్యానికి విసురుడు బియ్యంగాని, దంపుడు బియ్యంగాని, ఉప్పుడు బియ్యంగాని, బ్రౌన్ రైస్ గాని వాడాలి.
వరి, గోధుమ కంటే రాగి, సజ్జలు చవక. ఇవి ఎక్కువ బలవర్థకమైనవి కూడా. వీటిల్లో కాల్షియం, ఇనుము ఎక్కువగా ఉండి రక్తవృద్ధి, ఎముకల పటిష్టత, కండరాల సత్తువ కలుగుతుంది. చిన్నపిల్లలు, పెద్దలు రోజూ రాగిజావ తీసుకోవడం అవసరం. ఇది చవకలో లభ్యమయ్యే బలవర్ధకమైన పోషకాహారం.
మరిన్ని ఆరోగ్యకరమైన వార్తలు చదవండి :
కొలెస్టరాల్ (CHOLESTEROL) అంటే ఏంటి ? కొలెస్టరాల్ ఎక్కువయితే ఏమవుతుంది?
Vitamin Poisoning : అధిక మొత్తంలో విటమిన్లు తీసుకుంటే కలిగే నష్టాలు ?