Telugu Flash News

Eating too much salt : ఉప్పు ఎక్కువైతే.. అనారోగ్య సమస్యలు మీ వెంటే!

salt intake

salt intake

Eating too much salt : మనలో చాలా మంది నిత్యం రకరకాల వంటకాలు తిని ఆనందిస్తారు. చాలా మంది ప్రజలు అనేక వంటకాలను రుచి కోసమే తయారు చేసుకుని ఆనందిస్తారు. అయితే చాలా వంటకాలు బాగానే ఉన్నా .. ఉప్పు లేకుండా రుచిగా ఉండవు. తీపి వంటకాలు కాకుండా మిగిలిన కూరలు, ఇతర వంటకాలు ఏవైనా సరే.. సరిపడా ఉప్పు వేయాలి. తగినంత ఉప్పు తినడం మన ఆరోగ్యానికి మంచిదే కానీ ఉప్పు ఎక్కువైతే అనారోగ్య సమస్యలు వస్తాయి.

బీపీ, గుండెపోటు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో మనం రెగ్యులర్ గా తగిన మోతాదు కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే మన శరీరం మనకు అనేక లక్షణాలను తెలియజేస్తుంది. వాటి ప్రకారం మనం ఉప్పు ఎక్కువగా తింటున్నాం అని తెలుసుకోవాలి. దీని ప్రకారం, ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తింటున్నామంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఉప్పు ఎక్కువగా తింటే రోజుకు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఉప్పులోని సోడియంను బయటకు పంపడానికి శరీరం ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంది. అందుకే తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటాం. మీకు మధుమేహం లేకపోతే, మూత్రం ఎక్కువగా వెళుతుంటే, మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉప్పు ఎక్కువగా తింటే మూత్రం ఎక్కువగా వస్తుంది, దాహం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ లక్షణం కనిపించినా కూడా ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి.

ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలో వాపు వస్తుంది. ముఖ్యంగా పాదాల మడమ భాగంలో వాపు. అక్కడ వేలితో తాకితే చర్మం లోపలికి వెళ్లిపోతుంది. ఆ భాగంలో నీరు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. ఉప్పు ఎక్కువగా తినేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. దీనినే ఎడెమా అని కూడా అంటారు. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఉప్పు బాగా తింటే నాలుకపై ఉండే రుచి మొగ్గలు ఇతర రుచులను గుర్తించలేరు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలని అనిపిస్తుంది . మీకు ఈ సమస్య ఉంటే, మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి.

ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలోని నీటిని త్వరగా కోల్పోతారు. ఫలితంగా డీహైడ్రేషన్ మరియు తలనొప్పి కలుగుతాయి. కాబట్టి ఆహారంలో ఉప్పు తగ్గించండి. ముఖ్యంగా వేసవిలో శరీరం సహజంగానే డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు తగ్గించడం మంచిది.

also read :

Anjeer Health Benefits : అంజీర్ పండ్లను తిన‌డం వ‌ల్ల శృంగార సమస్యలు తొలగిపోతాయా?

Weight loss Tea : ఈ టీ తాగితే బరువు తగ్గుతారని మీకు తెలుసా ?

 

 

Exit mobile version