Telugu Flash News

Curd with Sugar : పెరుగులో చక్కెర కలిపి తింటే ప్రమాదమా?

eating curd and sugar

Curd with Sugar : మనలో చాలా మందికి పెరుగులో చక్కెర కలుపుకొని తినే అలవాటు ఉంటుంది. హిందూ సంప్రదాయంలో బయటకు వెళ్తున్నప్పుడు ఓ చిన్న గ్లాస్‌లో పెరుగు చక్కెర కలిపి తిని వెళ్తే శుభప్రదమని చెబుతారు. పెరుగు మంచిదే కానీ అందులో కలిపే పంచదార శరీరానికి ఆరోగ్యకరం కాదని నిపుణులు చెబుతున్నారు.ఈ కాంబినేషన్‌ను రోజూ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

పెరుగు-పంచదార కలిపి తినడం వల్ల క్యాలరీలు అధికంగా శరీరంలో చేరుతాయని చెబుతున్నారు. ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల కొంతమందిలో విరోచనాలు అవుతాయి. పెరుగు, పంచదారను కలిపి తింటే మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉందట. పెరుగులో ఏమీ కలుపుకోకుండా తినడం వల్ల ఎంతో ఆరోగ్యం చేకూరుతుందని చెబుతున్నారు.

పంచదార కలపని పెరుగు తింటే దంతాలకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంగా పంచదార, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల దంత క్షయం వచ్చే అవకాశం ఉంటుందట.

also read :

Varsha: ఎట్ట‌కేల‌కు జ‌బ‌ర్ధ‌స్త్ వర్ష పెళ్లి బాజా మొద‌లైంది.. వ‌రుడు ఎవ‌రంటే..!

hair colour : శిరోజాలకు రంగు వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..

భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..

moral stories in telugu : మంచి స్నేహితుని కోల్పోయిన సింహం

 

Exit mobile version