Telugu Flash News

summer foods : వేసవిలో తప్పక తీసుకోవాల్సిన ఫుడ్స్‌ ఇవే..

summer foods

summer foods : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండంతో శరీరం కష్టపడటం ఎక్కువవుతోంది. వేసవిలో ప్రత్యేకించి కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా ఎండ తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవిలో దొరికే సీజనల్‌ ఫ్రూట్స్‌ను కచ్చితంగా తీసుకోవాలి.

Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే.. 

పుచ్చకాయలు, మామిడి బెర్రీలు, కర్బూజా, పైనాపిల్‌, పీచెస్‌ లాంటివి వేసవిలో ఎక్కువగా దొరుకుతాయి.
ఆయా ఫ్రూట్స్‌ తీసుకుంటే వాటిలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ, పైనాపిల్, పీచెస్ వంటివి మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు తోడ్పడతాయి.

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి.. 

వీటిలొ కొవ్వు శాతం అస్సలు ఉండదు. కాబట్టి వాటిని తినడం ద్వారా శరీరంలో నీటి స్థాయిని కాపాడుకుంటూనే వెయిట్‌ లాస్‌ కావొచ్చు. సత్తు పిండితో చేసే పానీయం వేసవిలో కచ్చితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని గుర్తు చేస్తున్నారు. పండ్లు లేదా కూరగాయలతో చేసిన సలాడ్‌ను రోజూ తినడం ద్వారా శరీరంలో బలం పెంపొందించుకోవచ్చు.

Exit mobile version