Telugu Flash News

Bone health : ఎముకల పటుత్వం కోసం తినాల్సిన ఆహారాలు ఇవే..

Bone health : శరీర నిర్మాణానికి ఎముకలు కీలకమైనవి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎముకలు ధృడంగా ఉండాలంటే కాల్షియం కావాలి. ముఖ్యంగా మహిళలకు ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.పెద్దలు తమ ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది.

10 Health Benefits of Sweet Potatoes You Need to Know

శరీరంలోకి కాల్షియం శోషణకు మెగ్నీషియం, విటమిన్ ఏ, డీ వంటి ఇతర పోషకాలు కూడా అవసరం అవుతాయి. రోజూ 6 క్యారెట్లు, 50 గ్రాముల బచ్చలికూర వేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే బలం చేకూరుతుంది. ఇది సుమారు 300 మిల్లీగ్రాముల కాల్షియం ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

health benefits of beans | బీన్స్‌ తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..

రాజ్మా, కాబూలీ చనా, బ్లాక్ దాల్, కులీట్ వంటి పప్పుల ద్వారా కూడా కాల్షియం పొందవచ్చు. రోజూ 2-3 టేబుల్ స్పూన్ల తెల్ల లేదా నల్ల నువ్వులు తింటే కాల్షియం కావాల్సినంత లభిస్తుంది. బచ్చలికూర, కాలే, బ్రకోలి వంటి ఆకుపచ్చని ఆకు కూరల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్ కలిగి ఉన్నందున ఎముకలకు మేలు చేస్తుంది.

సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి. బెర్రీలు, నారింజ, ద్రాక్షలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.

Exit mobile version