- నేపాల్ లో ఆరుగురి మృతి
భారత్, చైనా, నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ 6.3గా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, యూపీ-ఉత్తరాఖండ్, బీహార్, హర్యానా , మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఉదయం 6.27 గంటలకు మళ్లీ స్వల్పంగా భూకంపం వచ్చింది . రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అయితే, భూకంపం కారణంగా భారతదేశంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు. గోరఖ్‌పూర్‌లో కూడా అర్థరాత్రి తర్వాత భూకంపం సంభవించింది.
రెండుసార్లు భూకంపం సంభవించిందని ఆ జిల్లా విపత్తుల విభాగం నిపుణుడు గౌతమ్ గుప్తా టెలిఫోనిక్ సంభాషణలో తెలిపారు. గోరఖ్‌పూర్‌లో రాత్రి 8:52 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో, మధ్యాహ్నం 1:57 గంటలకు 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించినప్పుడు చాలా మంది ప్రజలు నిద్రలో ఉన్నారు. భూకంపాన్ని ఫీల్ అయిన వారు వెంటనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు.
నేపాల్ లో..
ఇక నేపాల్‌లో వచ్చిన భూకంపం వల్ల ఇల్లు కూలి ఆరుగురు చనిపోయారు. ఒకదాని తర్వాత ఒకటి మూడు ప్రకంపనలు వచ్చాయి. మొదటిసారి ఉదయం 8.52 గంటలకు, రెండోసారి రాత్రి 9.41 గంటలకు, మూడోసారి మధ్యాహ్నం 1:57 గంటలకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంప కేంద్రం నేపాల్
భూకంప కేంద్రం నేపాల్‌లో ఉందని మణిపూర్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అంచనా వేసింది. నవంబర్ 8 ఉదయం 4:37 నుండి నవంబర్ 9 ఉదయం 6:27 వరకు, ఉత్తర భారతదేశంలో 3 సార్లు భూకంపం వచ్చిందని తెలిపింది. మంగళవారం అర్ధ రాత్రి 01:57 గంటలకు బలమైన భూకంపం యొక్క ప్రకంపనలు సంభవించాయని తెలిపింది.నేపాల్ లోని భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించింది. దీని తర్వాత వచ్చిన భూకంపానికి కేంద్రంగా ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గర్ ఉంది.
Nepal | An earthquake of magnitude 6.3 occurred in Nepal, Manipur at around 1.57 am on Nov 9. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology
Strong tremors from the earthquake were also felt in Delhi pic.twitter.com/YNMRQiPEud
— ANI (@ANI) November 8, 2022
మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా 3 సార్లు..
* నేపాల్, మణిపూర్‌లలో మంగళవారం అర్ధరాత్రి 1.57 గంటలకు 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.
భూకంప కేంద్రం యొక్క లోతు భూమికి 10 కి.మీ దిగువన ఉన్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భూకంప ప్రకంపనలు భారత రాజధాని ఢిల్లీలోనూ సంభవించాయి.
* అయితే దానికి కొన్ని గంటల ముందు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. దీనికి సంబంధించిన భూకంప కేంద్రం ఉత్తరాఖండ్ లోని భారత్ , నేపాల్ సరిహద్దుల్లో ఉన్నట్లు వెల్లడైంది.
* ఈ రెండు భూకంపాల కంటే ముందు మంగళవారం ఉదయం 11 గంటల 57 నిమిషాలకు ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని భూకంప కేంద్రం మిజోరం లోని చంఫాయి లో ఉన్నట్లు గుర్తించారు.
also read news:
గ్రీన్ టిక్ ఫ్రీగా ఇస్తాం రండి.. కొత్త యూజర్స్ కోసం Koo అన్వేషణ!!