దుబాయ్ (Dubai) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంలో భాగంగా మద్యంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మద్యంపై ఉన్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం నుంచే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది దుబాయ్ ప్రభుత్వం. దాంతోపాటు ఆల్కహాల్ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించింది.
ఇప్పటి వరకు దుబాయ్ లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత లైసెన్స్ తప్పనిసరి. అయితే, తాజాగా దుబాయ్ ప్రభుత్వం మద్యం విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. చట్టాలను సులభతరం చేసింది. అయితే, దుబాయ్ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం తాత్కాలికమా, లేక శాశ్వతమా అనేది తేలాల్సి ఉంది. పర్యాటకుల్ని ఆకర్షించేందుకే దుబాయ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, అన్ని దేశాలతో పాటే తామూ నిర్ణయాలు తీసుకుంటామని నిరూపించేందుకు దుబాయ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది.
ముస్లిం దేశమైన దుబాయ్ లో.. మద్యం విషయంలో సాధారణంగానే కాస్త కఠిన చట్టాలు ఉంటాయి. అయితే, కొన్ని వస్తువులు, బంగారం లాంటి విషయాల్లో జీరో ట్యాక్స్ లేదా తక్కువ పన్ను ఉంటుంది. అందుకే షాపింగ్ కోసమైనా చాలా మంది దుబాయ్ కి వెళ్లి వస్తుంటారు. ఒక్క మద్యం విషయంలోనే దుబాయ్ కఠిన చట్టాలు ఇప్పటి వరకు అమలు చేస్తోంది. కానీ, అక్కడికి పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ క్రమంలో చట్టాలను సులభతరం చేయక తప్పడం లేదనే వాదన వినిపిస్తోంది.
సందర్శకులకు వెసులుబాటు..
తాజాగా తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు, సందర్శనార్థం వచ్చే వారికి గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. 2023 జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ముఖ్యమైన ప్రకటన చేసింది. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దుబాయ్ లో ఉన్న రెండు ప్రభుత్వ లిక్కర్ కంపెనీలు మారిటైమ్ అండ్ మెర్సంటైల్ ఇంటర్నేషనల్ కూడా లిక్కర్‌పై ట్యాక్స్, లైసెన్స్ రుసుమును రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ రెండూ ఎమిరేట్స్ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి.
also read :
Dandruff: చుండ్రు తగ్గడానికి చిట్కాలు.. శాశ్వతంగా చుండ్రుకి గుడ్ బై చెప్పండి..
కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా..ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి..!