Telugu Flash News

dry cough home remedies : పొడి ద‌గ్గు త‌గ్గించే అమేజింగ్ చిట్కాలు మీ కోసం!

cough tips

dry cough home remedies : సాధారణంగా మనలో కొందరికి ఎప్పుడైనా పొడి దగ్గు వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది పొడి దగ్గుతో బాధపడుతుంటారు. మన శ్వాసకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది. వాతావరణంలో మార్పు మరియు శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల దగ్గు ఎక్కువగా వస్తుంది. అయితే ఇలా పొడి దగ్గు తగ్గాలంటే కింద పేర్కొన్న చిట్కాలను పాటించాలి. దీంతో దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే…

పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు అల్లం టీ తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. అర టీస్పూన్ శొంఠి పొడిని ఒక టీస్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీరు పొడి దగ్గుతో బాధపడుతుంటే, అర టీస్పూన్ ఇంగువపొడి , ఒక టీస్పూన్ తాజా అల్లం రసం మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. కరక్కాయ పొడి దగ్గును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగితే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.

పాలలో మిరియాల పొడి వేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.తులసి ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేడి టీ లేదా తేనె మరియు నిమ్మరసం కలిపిన నీరు వంటి ద్రవాలను పుష్కలంగా తాగడం వల్ల  ఉపశమనం పొందవచ్చు. ఉప్పునీరు లేదా సాధారణ నీటితో పుక్కిలించడం వల్ల నోరు మరియు గొంతులోని బ్యాక్టీరియాను వదిలించుకోవచ్చు. తేనె, వెల్లుల్లి, నిమ్మ, పైనాపిల్ మరియు దానిమ్మ రసం పొడి దగ్గు కి సహాయపడవచ్చు.

also read :

వర్క్‌ బిజీలో శృంగారానికి దూరమవుతున్నారా.. శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని చిట్కాలు!

Anjeer Health Benefits : అంజీర్ పండ్లను తిన‌డం వ‌ల్ల శృంగార సమస్యలు తొలగిపోతాయా?

Kidney health : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా ?

 

 

 

Exit mobile version