HomehealthDrumstick Benefits : మునగాకు ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి.. 300 వ్యాధుల‌ని న‌యం చేస్తుందట !

Drumstick Benefits : మునగాకు ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి.. 300 వ్యాధుల‌ని న‌యం చేస్తుందట !

Telugu Flash News

Drumstick Benefits : ప్రకృతి సంపదలో మ‌న‌కు మంచి ఆరోగ్యాన్ని అందించే వాటిలో మునగాకు ఒకటి. చాలా మంది మున‌గాకుని కూర‌ల‌లో వాడుతుంటారు. అస‌లు మున‌గాకు ఉప‌యోగాలు తెలిస్తే దీనిని తిన‌ని వారు కూడా మ‌క్కువ చూపిస్తుంటారు.

మున‌క్కాయ‌లోనే కాదు మున‌గాకులోను అనేక విట‌మిన్స్ ఉంటాయ‌ని ప‌లు విశ్లేష‌ల‌లో తేలింది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో వింట‌మిన్స్ ఉండ‌వ‌నేది నిజం. 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో ఉప‌యోగిస్తున్నారంటే దాని ప‌వ‌ర్ ఏంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మునగాకుతో ఎన్నో ప్రయోజ‌నాలు..

పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు ఎక్కువ‌గా ప‌డ‌తాయ‌ట‌. ఇక గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చ‌ల్లార్చాలి. ఆ త‌ర్వాత అందులో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సం వంటివి క‌లిపి తాగితే ఆస్త‌మా, ద‌గ్గు వంటివి తొల‌గిపోతాయి.

మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే మ‌న ముఖంపై ఉండే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని అంటుంటారు

వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు ఏంట‌నేవి చూస్తే .. నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, ‘సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం,పీచు పదార్థం 0.9 మి గ్రా,ఎనర్జీ 97 కేలరీలు ఉన్నాయి.

ఇన్ని పోష‌కాలు ఇత‌ర ఏ ఆకుకూర‌ల‌లో కూడా ఉండ‌వు. అందుకే మున‌గాకుని ఏ మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌కుండా ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక రూపంలో తీసుకుంటే మ‌న ఆరోగ్యానికి మంచి మేలు జ‌రుగుతుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News