draupadi murmu : ఒక దేశానికి రాష్ట్రపతిగా ప్రాతినిధ్యం వహించడం అంటే అది అనుకున్నంత సులవైన పని కాదు. రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత న్యాయ వ్యవస్థను పటిష్టంగా అమలయ్యే విధంగా చూసుకోవాలి.అలాంటి ఒక బలమైన బాధ్యత గల పదవిని సమర్థవంతంగా అందర్నీ ప్రభావితం చేసే విధంగా ప్రస్తుతం నిర్వర్తిస్తున్న మహిళ ద్రౌపది ముర్ము.
1958,జూన్ 20న ఒడిశాలోని రాయ్ నగర్ లో ఒక మామూలు రైతు కుటుంబానికి చెందిన బిరంచి నారాయణ్ తుడుకి జన్మించిన ద్రౌపది ముర్ము అసలు పేరు పుటి తుడు కాగా,ఆమె స్కూల్ లో చదివే రోజులలో ఉపాధ్యాయులు ఆమె పేరును ద్రౌపదిగా మార్చి పిలవడం మొదలు పెట్టారు.
ఇక చిన్న తనం నుంచి చదువుపై మంచి ఇష్టం ఏర్పరుచుకున్న ద్రౌపది ముర్ము 5 ఏళ్ల వయసులో తన ప్రాథమిక విద్య కోసం భువనేశ్వర్ కి నివాసం మార్చి గర్ల్స్ హై స్కూల్ లో (girls high school) చేరారు.
తన ప్రాథమిక విద్యను ముగించుకున్న తరువాత రమా దేవి ఉమెన్స్ కాలేజీలో తన బి.ఏను పూర్తి చేశారు.
1979 నుంచి 1983 వరకూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో (irrigation department) జూనియర్ అసిస్టెంట్ గా చేసిన ఆమె ఒక ఏడాది తరువాత శ్యామ్ చరణ్ ముర్ము ని వివాహమాడారు.
ఆ తరువాత హిందీ,మాథ్స్ లాంటి సబ్జెక్టులను బోధించడానికి ఉపాధ్యాయురాలిగా కూడా మారారు. అయితే ఆమె అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పిన 3 ఏళ్లలో ఏ రోజూ కూడా పూర్తి జీతాన్ని స్వీకరించలేదట.
రాజకీయ ప్రస్థానం
1997లో రాయ్ నగర్ కి కౌన్సిలర్ గా ఎన్నికైన ద్రౌపది ముర్ము 2000 లో ఎమ్.ఎల్.ఏ పదవికి ఎన్నికై రెండు సార్లు ఆ పదవిలో తన బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే 2007లో బెస్ట్ ఎమ్.ఎల్.ఏ గా నికంత్ అవార్డ్ ను అందుకున్నారు. 2013-2015 సమయంలో బీజేపీ లో నేషనల్ ఎక్సిక్యుటివ్ మరియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.
ఇలా ప్రతి దశలో అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చిన ఆమె 2015 వరకు వివిధ పదవులలో నిర్వర్తించిన సమయంలో ఆమె భర్తను, ఇద్దరు కొడుకులను, అమ్మను ఆఖరికి తన సోదరుడిని కూడా కోల్పోయి ఎవరికీ వ్యక్త పరచలేనంత బాధకు లోనైయ్యారు. అయితే ఎంత బాధకు గురైనా సరే నిరాశ కు లొంగని ఆమె దృఢమైన సంకల్పంతో తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వచ్చారు.
ఆ దృఢ సంకల్పంతో 2015 లో గవర్నర్ పదవిని సొంతం చేసుకుని 2021 వరకు ఆశ్చర్య పరిచే ప్రతిభతో తన బాధ్యతను నిర్వర్తించారు. ఇటీవలే ఆగస్ట్ 14 న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసి, భారత దేశ 15 వ రాష్ట్రపతిగా మరియు ఆ పదవికి ఎన్నికైన తొలి గిరిజనురాలిగా చరిత్ర సృష్టించారు.
ఎన్ని కష్టాలు వచ్చిన లొంగకుండా తన ధృడ సంకల్పంతో, ప్రతిభతో నలుగురికీ ఆదర్శంగా నిలిచిన ద్రౌపదీ ముర్ము మన దేశ రాష్ట్రపతిగా రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు