Telugu Flash News

turmeric milk :పసుపు పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందా ?

turmeric milk

turmeric milk

turmeric milk : ప్రతి ఒక్కరికీ రోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇందులో కాస్త మంచి పసుపు కలిపితే.. రుచి బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. పాలలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును చాలా చురుకుగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల రిపేర్‌లో సహాయపడతాయి.

రోజూ మూడు గ్లాసుల పాలు తాగే వారు వ్యాధులకు దూరంగా ఉంటారని అనేక పరిశోధనల్లో తేలింది. ఇలాంటి గుణాలున్న పాలల్లో పసుపు కలిపితే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది పురాతన కాలం నుండి ఉంది. మన పూర్వీకులు కూడా పసుపు పాలు తాగేవారు. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు.

దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలు తాగితే ఉపశమనం కలుగుతుంది. అధిక కఫంతో బాధపడేవారు గోరువెచ్చని పసుపు పాలు తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పాలలో మెదడులోని సెరోటోనిన్ మరియు మెలటోనిన్ రసాయనాలు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే కీలకమైన పోషకాలతో కలిసి ఒత్తిడిని దూరం చేస్తాయి. హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.

పసుపు పాలతో మరిన్ని ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు పాలు కాలేయాన్ని వైరల్ దాడి నుండి రక్షిస్తుంది. కాబట్టి కామెర్లు వంటి కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరవు.
కాలేయం నుండి విషాన్ని తొలగిస్తుంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి మరియు ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలు క్రమం తప్పకుండా తాగాలి.
పసుపు పాలలోని పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు శోషరస వ్యవస్థను కూడా శుద్ధి చేస్తాయి.
కామెర్లు రాకుండా నివారిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని నిరోధిస్తుంది.
నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే వైరస్ త్వరగా పెరగకుండా పసుపు నిరోధిస్తుంది.
పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు కీళ్లను బలపరుస్తుంది.
పసుపు పాలు తాగితే బహిష్టు వల్ల వచ్చే కడుపు నొప్పి మరియు ఇతర పొత్తికడుపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

also read :

Horoscope Today, 13th september 2023 ఈ రోజు రాశి ఫలాలు

Best morning routine : ఉద‌యం నిద్రలేవగానే ఈ పనులు చేయండి !!

Longevity : ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి ? ఈ 8 చెడు అలవాట్లను మానేయండి !!

 

Exit mobile version