Samantha: నాగ చైతన్య- సమంత జంట ఎంత చూడచక్కగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎవరి జిష్టి తగిలిందో ఏమో కాని పెళ్లైన నాలుగేళ్లకే వీరిద్దరు విడిపోయి అందరు షాక్ అయ్యేలా చేశారు.
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత విడివిడిగా వారి జీవితాలు గడుపుతుండగా,తిరిగి కలిస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. మరి కొందరైతే ఈ ఇద్దరు రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ప్రచారం చేస్తున్నారు.
ఆ మధ్య నాగ చైతన్య ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాడని పుకార్లు షికారు చేశాయి. ఇక ఇప్పుడు సమంత .. సద్గురు సూచనతో రెండో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.
సమంత పెళ్లిపై గాసిప్..
పరిశ్రమలో సమంత ఓ సంచలనం. స్టార్ హీరోయిన్ కావాలంటే పాల వన్నె రంగు, ఒద్దు పొడుగు, కట్టిపడేసే అందం ఉండాలనే నమ్మకాలను చేసి సరికొత్త సెన్సేషన్ క్రియటే్ చేసింది సమంత.
సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ముంబైలో ఉంటోంది. బీటౌన్‌కి చెందిన ఓ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతోందని , అతనితో ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ సమయంలోనే అతనితో చనువు ఏర్పడిందని పలు రకాలుగా చెప్పుకొచ్చారు.
అయితే ఈ పుకార్లపై క్లారిటీ రాకముందే సమంత రెండో పెళ్లికి సంబంధించి మరో వార్త హల్చల్ చేస్తుంది.
మొదటి నుండి సద్గురుకి సన్నిహితంగా ఉంటూ ఆయన సూచనలు పాటిస్తూ వస్తున్న సమంత ఇప్పుడు ఆయన చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైనట్టు ప్రచారం నడుస్తుంది.
మొదటి నుంచి మానసికంగా ఇబ్బంది ఉంటే సద్గురు ప్రవచనాలు వినడం, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఉపాన్యాసాలు వినడం చేస్తుంది.
ఇప్పుడు తన పరిస్థితి గురించి సద్గరు ముందు సమంత పెట్టడంతో మంచి వ్యక్తిని చూసి ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.