HomecinemaSamantha : సమంత సినిమాలకు నిజంగానే బ్రేక్ పడిందా? మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు ?

Samantha : సమంత సినిమాలకు నిజంగానే బ్రేక్ పడిందా? మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు ?

Telugu Flash News

తన నటనతో మోడ్రన్ మూవీ మహనటిగా పేరు పొంది తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఏకైక నటి సమంత (samantha).అయితే అలాంటి సమంత సినిమాలకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయని సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపడుతున్నాయి.

అసలు విషయానికి వస్తే నటి సమంత మయోసైటిస్ అనే ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.కొన్ని నెలల క్రితం ఆమె మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్ళారని కూడా వార్తలొచ్చాయి.

samantha

అయితే ఆ తరువాత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో సమంత యశోద సినిమా సెట్లో జరిగిన ఒక చిన్న వీడియోని పోస్ట్ చేయడం, యశోద సినిమా విడుదల సమయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె బానే ఉన్నానని చెప్పడంతో నిజంగానే ఆమె బానే ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనల మూలంగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివిధ రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొంత కాలం క్రితం ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ను రూపొందించిన దర్శకులు రాజ్ అండ్ డీకే లు వరుణ్ ధావన్ తో తాము తీయబోతున్న ప్రైమ్ విడియోలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లో సమంత కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతుందని ప్రకటించారు. కాగా ఆ సిరీస్ కి సంబంధించిన ఒక పోస్టర్ ఇటీవలే విడుదల అయ్యింది.

కాకపోతే అందరూ ప్రశ్నించేలా చేసిన విషయం ఏంటంటే ఆ పోస్టర్లో ఆ సీరీస్ తో ప్రమేయం ఉన్న వారందరినీ అమెజాన్ టీం టాగ్ చేసింది.కానీ నటి సమంత పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

-Advertisement-

దీంతో సమంత ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని,అందుకే సినిమాలతో పాటు తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో కూడా యాక్టివ్ గా లేరని సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సమంత తన సినిమాల నుంచి తప్పుకుంటున్నారా?,ఆమె ఎందుకు సోషల్ మీడియా లో యాక్టివ్ గా లేరు?, ఆమె ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా దర్శకులు రాజ్ అండ్ డీకే ల నుండి కానీ,అమెజాన్ టీం నుండి కానీ ఆమె ఆ సీరీస్ లో నటిస్తుందా..లేదా..అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం రాలేదు.

ఇక ఈ విషయం పై సమంత ఎప్పుడు,ఎలా స్పందిస్తారో,రాజ్ అండ్ డీకే ల సమాధానం ఎలా ఉంటుందో ఇకపై చూడాలి మరి.

also read news: 

Taj Mahal : తాజ్ మహల్ చరిత్ర, మీరు తెలుసుకోవలసిన అత్యద్భుత నిర్మాణ విశేషాలు

Water : మన శరీరంలో నీటి అవసరం.. నీరు ఎక్కువైనా, తక్కువైనా వచ్చే సమస్యలేంటి ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News