‘మెటావర్స్’.. ఫేస్ బుక్ తీసుకొస్తున్న సరికొత్త సోషల్ మీడియా ప్రపంచం. దీన్ని రాబోయే తరం ఇంటర్నెట్ గా సైతం అభివర్ణిస్తున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తుందని విశ్వసిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్నెట్ తో పోలిస్తే మెటావర్స్ లో వినియోగదారుల భద్రత ఎంతమేర ఉంటుంది? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటేడ్ రియాలిటీ (AR) అనే టెక్నాలజీ లతో పనిచేసే మెటా వర్స్ ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచే క్రమంలో విశ్వసనీయంగా ఉండగలదా? అనే ప్రశ్న అందరి మదిని వెంటాడుతోంది. టెక్ నిపుణులు మాత్రం మెటా వర్స్ ను వినియోగించే క్రమంలో భద్రత లభించే అంశంపై పెదవి విరుస్తున్నారు. ప్రతి కొత్త టెక్నాలజీతో పాటు కొన్ని కొత్త సైబర్ సవాళ్లు పెనవేసుకొని ఉంటాయని చెబుతున్నారు.
“మెటావర్స్ లోనూ ఫిషింగ్, అకౌంట్ల హ్యాకింగ్, NFT స్కామ్స్, క్రిప్టోకరెన్సీ స్కామ్‌ల ముప్పు ఉండొచ్చు” అని ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక వృత్తిపరమైన సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (IEEE) సీనియర్ సభ్యుడు కేన్ మెక్‌గ్లాడ్రీ పేర్కొన్నారు.
అయితే మెటావర్స్ టెక్నాలజీ అభివృద్ధి లో బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడారని, దాన్ని సంపూర్ణంగా విశ్వసించవచ్చని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల మెటావర్స్ లో వినియోగదారుల భద్రత, సమాచార గోప్యతకు అవకాశం ఉంటుందని చెప్పారు. వినియోగదారులను చైతన్యం చేయడం, మాల్ వేర్ లింక్స్ క్లిక్ చేయకుండా నెటిజన్స్ ను జాగృతం చేయడం ద్వారా మెటావర్స్ ను సురక్షిత స్థానంగా మార్చొచ్చని వివరించారు.
వర్క్ ఫ్రం హోమ్ లో విప్లవం
మెటావర్స్‌లో వర్చువల్ కాన్సర్ట్‌లు, ఆన్లైన్ పర్యటనలు చేపట్టవచ్చు. అంతర్జాలంలోనే దుస్తులు ధరించి మనకు సరిపోయే సైజులను గుర్తించవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ విషయంలోనూ మెటావర్స్ విప్లవాత్మకంగా నిలవనుంది.
మెటా వర్స్ అంటే ?
ఫేస్‌బుక్ పేరు ఇప్పుడు ” మెటా”. మెటా త్వరలో తీసుకు రాబోతున్న సరికొత్త సోషల్ మీడియా టెక్నాలజీ పేరు “మెటా వర్స్”. మెటా వర్స్ అంటే విశ్వం ఆవల అని అర్ధం. ఊహా ప్రపంచానికి వాస్తవ అనుభూతికి కలిగించేలా మెటా వర్స్‌ను రూపొందిస్తున్నారు. ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ వర్చువల్‌గా కన్సోల్‌తో కంట్రోల్ చేయడం కాకుండా డైరెక్ట్‌గా ప్లేయర్ ద్వారా గేమ్‌లోకి ప్రవేశించవచ్చు. మనకు కావాల్సిన వ్యక్తులను తెరపై కాకుండా నిజంగా మనముందే ఉన్నారు అనే అనుభూతిని కలిగించవచ్చు. ఎక్కడో ఉన్న వ్యక్తులు రియల్‌గా మనముందే ఉన్నట్టు అనుభూతి చెందే విధంగా మెటా వర్స్‌ను రూపొందిస్తున్నారు.ఈ మెటావర్స్ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. దీన్ని అభివృద్ధి చేసేందుకు యూరప్‌లో 10 వేల మంది టెక్ నిపుణులను తీసుకోబోతున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది.
ఎలా పనిచేస్తుంది ?
మెటావర్స్ ద్వారా ఒక గ్రామంలో కూర్చున్న విద్యార్థి.. తరగతి గదిలో కూర్చున్న విధంగానే ఢిల్లీలోని పాఠశాల లేదా కళాశాలలో క్లాస్ తీసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు సహాయంతో మీరు మాట్లాడవచ్చు. మెటావర్స్ అనేది పూర్తిగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై ఆధారపడిన వర్చువల్ ప్రపంచం.
also read these news:
Bigg Boss 6 : ఇనయ, ఫైమా మధ్య తారాస్థాయికి చేరుకున్న గొడవలు..హీటెక్కిపోతున్న హౌజ్