Telugu Flash News

donald trump : రెస్టారెంట్‌లో బిల్లు కట్టకుండానే డొనాల్డ్ ట్రంప్ వెళ్లిపోయారన్న వార్తల్లో నిజమెంత ?

donald trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు. అతను తన మాటలకి మరియు ప్రవర్తనకు నిరంతరం విమర్శలకు గురవుతాడు. తాజాగా ట్రంప్‌ విషయంలో మరోసారి అదే జరిగింది. ట్రంప్ ఇటీవల ఓ హోటల్‌కు వెళ్లి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయారు.

అధికారిక రహస్య ఫైళ్లను తన ఇంట్లో దాచిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. మియామీలోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో స్థానిక రెస్టారెంట్‌ని సందర్శించారు. అక్కడున్న వారు ట్రంప్‌ను చూసి మాజీ అధ్యక్షుడిని చుట్టుముట్టారు. జూన్ 14న ట్రంప్ పుట్టినరోజు కావడంతో ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ అక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. ఆ తర్వాత బిల్లు కట్టకుండానే ట్రంప్ వెళ్లిపోయారని కొందరు చెప్పారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వార్తలను ట్రంప్ అధికార ప్రతినిధి ఖండించారు. ట్రంప్ వెళ్లిన తర్వాత రెస్టారెంట్‌లోని అందరూ కూడా ఫుడ్ ఆర్డర్ చేయకుండా వెళ్లిపోయారని ఆయన అన్నారు. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు రెస్టారెంట్ నిర్వాహకులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ రెస్టారెంట్ ను ట్రంప్ తప్పకుండా మళ్లీ సందర్శిస్తారని వివరించారు.

read more :

Amarnath Murder Case | ఎలాంటి రాజకీయ కోణం లేదు : ఎస్పీ వకుల్ జిందాల్

నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

Exit mobile version