కేసీఅర్ ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కూడా నెమ్మదిగా ఏపీలోకి ప్రవేశించాలనుకుంటుందని పార్టీ పెద్దల మధ్య, నాయకుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో కూడా తన రాజ్యాన్ని నిలపాలని నిర్ణయించుకున్న కేసిఅర్ ఇటీవలే మెగా బ్రదర్లకి సన్నిహితుడైన, బీసీ వర్గానికి చెందిన తోట చంద్రేఖర్ ను ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి అద్యక్షునిగా నియమించారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రజలు విభజనకు కారణమయ్యారనే కోపంతో దాదాపుగా 10 ఏళ్లుగా రాష్ట్రంలోకి రానివ్వకుండా తరిమేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో సారి అడుగు పెట్టాలనుకుంటున్నారట.
మరో పక్క పార్టీ స్థాపన విషయమై కేసీఅర్ త్వరలో ఏపీలో ఒక బహిరంగ సభను కూడా పెట్టబోతున్నారు.ఈ సభకు ప్రజాదరణ ఉంటుందని కూడా బిఆర్ఎస్ వాళ్ళు ఆశిస్తున్నారు.
ఇదే కనక నిజమైతే కాంగ్రెస్ మరో సారి ఏపీలో పూర్వవైభవాన్ని దక్కించుకుంటుందని విశ్వసనీయ వర్గాలు అంచనా.
అయితే ఈమధ్య చేసిన రాహుల్ పాదయాత్రతో రాయలసీమలో కాంగ్రెస్ కి ఉత్సాహాన్ని తీసుకు రావడంతో పాటు,వాళ్ళ పార్టీకి మరోసారి గెలుస్తామని ఆశ పుట్టించాడు.కాగా అక్కడ ప్రజలలో కనిపించిన ఊపు, ఉత్సాహం ఏపీ ప్రజలలో కూడా కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని మిగిలిన పార్టీ వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య జల వివాదాలకు ఇంకా పరిష్కారం దొరకలేదు.ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన,విద్యుత్ వినియోగ అంశాలపై కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఇవే కాక 9,10 షెడ్యూల్ లోని సంస్థల విభజన,ఆస్తుల పంపకాలు వంటి విషయాలలో ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.అందుకే సభలు, సమావేశాలకు జనాలు వచ్చినంత మాత్రానా ప్రజలు ఓట్లు వేస్తారన్న పిచ్చి నమ్మకం పెట్టుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇలా ఇన్ని అంశాలు దారీ తెన్నూ లేకుండా ఉన్న ఈ సమయంలో ఏపీ ప్రజలు కేసీఅర్ స్వాగతిస్తారా.. అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి వస్తున్నామనడంపై వివిధ రకాల ప్రశ్నలు,అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
also read :
Veera Simha Reddy Movie Trailer | ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తన మాటలతో ఏపీ ప్రజలను నెగ్గగలడా ?
Cricketers: చిన్న పిల్లల్లా మారిన టీమిండియా క్రికెటర్స్.. ముద్దొచ్చేస్తున్నారుగా…!
Viral Video : వావ్.. గ్రేట్ అనిపించే వీడియో.. 15,730 కేజీల ట్రక్కును పళ్లతో లాగేశాడు!