Iguana Island : డబ్బుంటే ఏదైనా కొనొచ్చు. బండి కొనొచ్చు, కారు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, మరీ అవసరం అయితే దీవిని కూడా కొనొచ్చు. దీవి కొనొచ్చు అనగానే నోళ్ళు వెళ్ళబెట్టి ఉంటారే. కానీ ఇది నిజం మరి..
కొంత మంది ధనవంతులు ఒక మంచి ఇల్లు, విశాలమైన ప్రదేశంలో నలుమూలలా పచ్చని చెట్లు ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశాలు కావాలని కోరుకుంటుంటారు.ఈ కోరికలను నిజం చేయడానికే కొన్ని సార్లు దీవులు అమ్మకానికి వస్తుంటాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక దీవి అమ్మకానికి వచ్చింది అది కూడా ఒక ఫ్లాట్ కంటే తక్కువ రేటుకి. ఫ్లాట్ కంటే తక్కువ రేటుకి దీవా..? అసలు ఒక దీవి అంత తక్కువ రేటుకి ఎలా అమ్ముడుపోతుంది..? ఇవి తెలియాలి అంటే ఈ స్టొరీ పై ఒక లుక్ వేయండి.
ఒక హై లగ్జరీ ఫ్లాట్ కంటే తక్కువ రేటు ఉందని అంటున్న ఆ ఐలాండ్ కరేబియన్ ప్రాంతంలో ఉన్న నికారాగ్వాకు దగ్గరలోని సముద్ర తీరానికి 12 మైళ్ళ దూరంలో ఉన్నది .ఇది ఒక అగ్నిపర్వత దీవి. ఈ దీవి పేరు ఇవ్వానా. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తయం చూసే వారికి మనసుకు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాధకరంగా ఉంటాయి.
ఇక ఈ అగ్నిపర్వత దీవి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి చెట్లు,అరటి చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇది ప్రస్తుతం privateislandsonline.com లో ఆన్లైన్లో అమ్మకానికి ఉంది. అయితే ఇది ఏదో అడవిలాగా, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండదు.
ధర ఎంతో తెలుసా ?
ఇక్కడ రోడ్లు, మూడు గదుల బెడ్ రూమ్,రెండు బాత్రూమ్ లతో కూడిన ఒక భవనం నివాసయోగ్యంగా ఉంటుంది. దీనికి ఒక మేనేజర్, బాగోగులు చూడడానికి పనివారు కూడా ఉంటారు.సెప్టిక్ సిస్టం, వాటర్ క్యాచ్ మెంట్ సిస్టం కూడా ఉంది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు కూడా ఉన్నాయి. ఇక్కడ నివసించాడనికి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
దీని ధర మూడు కోట్ల 86 లక్షల రూపాయలు. చాలా పెద్ద పెద్ద నగరాల్లో కేవలం ఒక ఫ్లాట్ ధర మూడు కోట్ల రూపాయల పైనే ఉంటుంది. అలాంటిది 5 ఎకరాల దీవి 3 కోట్లకంటే ధనవంతులకు ఇంతకంటే కావాల్సింది ఏంటి? పైగా దీన్ని కొని పర్యాటకులు అద్దెకు ఇస్తే డబ్బులు కూడా బానే సంపాదించవచ్చు.
అయితే ఇది ఇంకా అమ్ముడు కాలేదు. ప్రస్తుతం దీని అమ్మకానికి ఆన్లైన్ లో బిడ్డింగ్ జరుగుతుంది. ఎవరు ఎక్కువకి పాడుకుంటే ఇది వాళ్ళకి దక్కుతుంది. ఈ దీవి గురించి వింటుంటేనే అసక్తికరంగా, డబ్బులుంటే ఇప్పుడే కొనేయాలీ అని మనసు లాగేస్తుంది కదా..
Also read:
Go First airline : రూ.1,199 కే ఫ్లైట్ టికెట్.. బంపర్ ఆఫర్.. వెంటనే బుక్ చేసుకోండి..
Fish and Milk : చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయా ?