Telugu Flash News

Sadha : అందాల భామ సదా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా ?

actress sadaa saree photo

actress sadaa saree photo

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం చిత్రంతో అందాల భామ సదా (Sadha) కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా తొలిరోజునే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తన నటనతో ఆకట్టుకున్న సదా తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది.సదా తమిళంతో పాటు తెలుగులోనూ అప్పుడప్పుడు మలయాళంలో కూడా నటించింది. తమిళంలో విక్రమ్‌తో చేసిన అపరిచితుడు సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఆ సమయంలో సదా చాలా ఫేమస్ అయ్యింది. అయితే మెల్లమెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.దాంతో ఈ అమ్మడు కనిపించకుండా పోయింది. ఇక ఇప్పుడు మరోసారి హీరోయిన్ గా తన సత్తా చాటేందుకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దీంతోపాటు పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.

సదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రకరకాల ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇంతవరకు సదా పెళ్లి చేసుకోలేదు. ముప్పై ఏళ్లు వచ్చినా సదా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పింది.

నాకు పెళ్లి కాకపోవడం చాలా సంతోషంగా ఉందని.. నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని సదా తెలిపింది. తనకు వన్యప్రాణులంటే ఇష్టమని, జంతువులను కూడా ప్రేమిస్తానని సదా చెప్పింది. పెళ్లి చేసుకుంటే ఇదంతా రాదు.. మనల్ని అర్థం చేసుకునేవాళ్లు ఉంటారు.. వాళ్లూ మనల్ని అర్థం చేసుకుంటారు.. పైగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నవాళ్లు కూడా విడిపోతున్నారు.. అప్పుడు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని ఆమె చెప్పారు.

also read :

Crime News : ఈ కి’లేడి’ యమ డేంజర్ గురూ.. ఆన్ లైన్ లో వలవేసి 8 మందిని పెళ్లాడి మోసం చేసిన యువతి

 

Exit mobile version