Telugu Flash News

లైగర్‌ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు ?

లైగర్‌ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు ?

యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్‌. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన మరియు భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో విడుదల కి ముందే భారీ సంచలనం సృష్టించిన లైగర్‌ సినిమా, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. లైగర్‌ రిలీజ్ కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది.

నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. దీంతో విజయ్‌ దేవరకొండ కి సినిమా పై ఆశ పోయింది. అయితే సినిమా రిజల్ట్ పక్కన పెడితే విజయ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. శరీర మార్పు కోసం అతను చేసిన పోరాటం సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.

సినిమా రిజల్ట్ గురించి ఆలోచించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు . మళ్ళీ జిమ్‌లో ఉత్సాహంగా వ్యాయామం చేస్తున్నాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 100% ప్రయత్నం చేసినా ఫలితం మన చేతుల్లో లేదని కొందరు నెటిజన్లు విజయ్‌కి మద్దతుగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని చదవండి 

నిఖిల్ ఇంటర్వ్యూ : నాకు గాడ్ ఫాదర్ ఎవ్వరూ లేరు..అందుకే..

Megastar ‘Godfather’ digital rights for Amazon Prime ?

 

Exit mobile version