బాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్‌లో ఒకరైన అలియా భట్, రణబీర్ కపూర్‌లు అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వారి వివాహం ఏప్రిల్ 14 2022 న కాగా , నవంబర్ 6 2022 న ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో అలియా పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆలియా తన కూతురితో సరదాగా గడుపుతోంది. RRR సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఆలియా. బ్రహ్మాస్త్ర సినిమాలో ఆలియా, రణబీర్ కలిసి నటించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట తమ పాప పేరును ప్రపంచానికి వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే వారు తమ బిడ్డ పేరును ప్రకటించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యునిసెఫ్ లోగోతో కూడిన జెర్సీపై తన కుమార్తె పేరు ముద్రించిన ఫోటోను అలియా షేర్ చేసింది. ఈ సమయంలో ఇద్దరూ బిడ్డను ప్రేమగా లాలిస్తున్నారు. కానీ వారు పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు . ఆలియా, రణబీర్‌లు తమ బేబీ కి ‘రాహా’ అనే పేరును ఖరారు చేశారు.
ఐతే రాహా అంటే ఏంటి అనే సందేహం మీలో ఉండే ఉంటుంది . ఈ విషయాన్ని వివరిస్తూ అలియా ఈ విదంగా రాసింది. ‘రాహా (మా అమ్మమ్మ ఈ పేరు పెట్టింది ). రాహా అనే పేరుకు చాలా అందమైన అర్థాలు ఉన్నాయి. రాహా అంటే స్వచ్ఛమైన దివ్య మార్గం. స్వాహిలిలో ఆనందం అని అర్థం. సంస్కృతంలో రాహా అంటే వంశం, బెంగాలీలో విశ్రాంతి, అరబిక్‌లో శాంతి, ఆనందం, స్వేచ్ఛ. మా జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు రాహా’ అని రాసింది.
View this post on Instagram
also read news:
IND vs NZ ODI: సంజూ శాంసన్‌కు చోటు దక్కెనా..? కెప్టెన్ ధావన్ షాకింగ్ సమాధానం !
బిస్లరీ యజమాని తన కంపెనీని ముఖేష్ అంబానీకి బదులుగా టాటాకు ఎందుకు విక్రయిస్తున్నాడు?