Homedevotionalpunishments in hell : నరకాలు - అక్కడ అనుభవించవలసిన శిక్షలు ఏంటో తెలుసుకోండి..

punishments in hell : నరకాలు – అక్కడ అనుభవించవలసిన శిక్షలు ఏంటో తెలుసుకోండి..

Telugu Flash News

punishments in hell : ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలు ప్రజలను సన్మార్గంలో నడవాలని అలా నడవకపోతే వారిని భగవంతుడు శిక్షిస్తాడని, ఆ శిక్షించబడే ప్రదేశాన్నే నరకం అంటారని తెలుపుతుంది. మనుష్యులు అనేక కారణాల చేత తప్పులు చేస్తారు. అందరిచేత అంగీకరింపబడని ఈ తప్పులనే పాపాలు అంటారు. పాపాలు ఎన్నో రకాలుగా ఉంటాయి.

పాపాలు చేసినవారు తప్పక నరకానికి పోతారని, వారు అనేక శిక్షలను అనుభవించవలసి వస్తుందని వివిధ మతాలు బోధిస్తాయి. హిందూ మతంలో కూడా నరకాల ప్రస్తావన ఉన్నది. వివిధ రకాలైన పాపాలను పోయే నరకాలు, అచ్చట అనుభవించవలసిన శిక్షలను గురించి మన పురాణాలు విపులంగా తెలుపుతున్నాయి. మత్స్య, మార్కండేయ, భాగవత, అగ్ని, గరుడ పురాణాలలో ఈ నరకాల ప్రసక్తి కనిపిస్తుంది. వ్యాసకృత శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో నరకాలను గురించి విపులంగా తెలుపబడింది.

మహా భయంకరమైన ఈ నరకాలు ముల్లోకాలకు ఆవల దక్షిణ దిక్కులో భూమ్యాకాశాల నడుమ ఉన్నాయని భాగవతం తెలుపుతుంది.

తగదని చెప్పిన పనులను చేయటం అధర్మం. అటువంటి నిషేధిత అధర్మాన్ని ఆచరించే వ్యక్తి నరకానికి పోతాడు. యముడు తన అనుచరులతో తనలోకం చేరుకొనే జీవులకు జీవిత కాలంలో వారు చేసిన కర్మలకు తగినట్లుగా ఫలం ప్రసాదిస్తూ శిక్షిస్తుంటారు.

ఇవి మొత్తం 28 రకాలు. అవి

1. తామిస్రము:

ఇతరుల సొమ్మును అపహరించి భార్యా బిడ్డలను అపహసించటం చేసేవాడిని యమ భటులు తాళ్ళతో బంధించి తామిస్రంలో బలవంతంగా పారవేసి పరి పరివిధాలుగా వస్తారు. అన్నం పెట్టక కొండపై నుంచి దొర్లించి కర్రలతో మోదుతారు.

-Advertisement-

2. అంధతామిస్రం :

ఇతరుల భార్యను, కామించి అనుభ వించిన వానిని అంధతామిస్రం అనే నరకంలో పడవేసి, అనేక బాధలకు గురిచేస్తారు.

3.రౌరవం :

తన దేహం మీద, దేహానికి సంబంధించిన వాటిపైన అభిమానంతో ఇతరులకు ద్రోహంచేసే వాడు రౌరవ నరకానికి చేరుకుంటాడు.

4. మహారౌరవం :

ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, ఇతరులకు ఏ మాత్రం అపకారం తలపెట్టని పశు, పక్షి, మృగాదులను లను బాధించేవారు మహారౌరవ నరకంలో పడతారు. రురు అంటే పాము కంటే మిక్కిలి క్రూరమైన జంతువు. ఈ నరకంలో రురు అంటే భయంకరమైన శిక్షలు అనుభవించవలసి వస్తుంది.

5. కుంభీపాక నరకం:

తమ కడుపు నింపుకోవటం కోసం ఎలుకల కన్నాలు మూసి వాటిని చంపే నిర్దయులు కుంభీపాక నరకంలో పడతారు.

6. కాలసూత్రం :

తల్లిదండ్రులను, వేదవేత్తలను బాధించి సజ్జనులైన బ్రాహ్మణులకు, వేదములకు కీడు తలపెట్టేవారు కాలసూత్ర నరకంలో పడతారు. ఈ నరకంలో ఉండే రాగి మైదానంలో లోహపాత్రలమీద జీవిడిని నడిపిస్తారు. పైన సూర్యుని తాపం, క్రింద అగ్నివేడికి ఆ మైదానంలో పాపి మహాయాతనలు పొందుతాడు. అతడు తన ఒంటి మీద ఉన్న రోమాల సంఖ్యకు సరిపోయే అన్ని సంవత్సరాలు అక్కడ ఉంటాడు.

7, అసిపత్రవనం:

ఆపదలేని స్థితిలో కూడా వేద ధర్మాన్ని వదలిపెట్టి విరుద్ధమైన పాషండ మార్గం అవలంభించే పాపులు ఈ నరకంలో పడతారు. అందులో కత్తులవంటి ఆకులు గల చెట్ల నడుమ నడుస్తుండగా ఇరుప్రక్కల కత్తుల వంటి ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతుంటాయి. అతడు ఎంత మొర పెట్టుకున్నా యమభటులు ఆ విధంగానే బాధిస్తారు.

8. కాలసూత్రనరకం:

రాజు కానీ రాజు యొక్క అధికారి గానీ దండించతగని సాధువులను దండించి, నిర్దోషులకు శిక్ష వేసిన వారిని లేక బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించిన వారిని కాలసూత్ర నరకంలో పడవేస్తారు. అక్కడ యమభటులు అతడిని చెరకు గడ విరిచినట్టుగా నడిమికి విరిచి గానుగలో పెట్టి పిప్పి చేసి హింసపెడుతూ ఉండగా అతడు మొరపెడతాడు. దీనికి ఇంకొక పేరు సూకరముఖరనరకము.

9. అంధకూపనరకం:

విధి నియమించిన ప్రకారము తమ బ్రతుకు తాము గడుపుతున్న జంతువులను హింసించేవాణ్ణి అంధకూప నరకంలో పడవేయగా తాను చేసిన పాపాల కారణంగా జీవుడు ఆ నరక కూపంలో దొర్లుతూ, ఉండగా తాను ఏ జీవులను హింసించాడో అవి అతడిని క్రూరంగా పీక్కొని తింటాయి. నల్లులు, దోమలు, పాములు, ఈగలు కూడా వాడిని పీక్కొని తింటాయి.

10. క్రిమిభోజన నరకం:

బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు సేవ చేయక, వారు మరణించిన తరువాత పితృకార్యములను దోషము చేత తాను కూడా బెట్టిన ధనములో ఏ కొంచెము తన వారికి పెట్టకుండా తాను ఒక్కడే కాకివలె భక్షించినవాడిని క్రిమి భోజన నరకంలో పడద్రోసి అక్కడ పురుగై లక్షయోజనాల పురుగుల గుంటలో కూరుకొని పోయి ఉండి పురుగులను ఆహారంగా తింటుంటాడు.

11. అగ్నితప్త: తనకు ఎటువంటి కష్టం లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారాన్ని, రత్నాలను ఇతర విలువైన వస్తువు అపహరించినవానిని ఇందులో పడివేసి యమభటులు ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వలతో గుచ్చి శిక్షిస్తారు. పట్టకార్లతో చర్మాన్ని బలవంతంగా పీకివేస్తారు. దీనినే సందశనం అని కూడా అంటారు.

12. తప్తసూర్మి :

సంభోగించకూడని స్త్రీలతో సంభోగించిన పురుషుడు, ఆ విధంగా పురుషునితో సంభోగించిన స్త్రీలు, ఎర్రగా మండుతున్న ఇనుప స్త్రీ ప్రతిమచేత పురుషుని, మండుచున్న పురుష ప్రతిమతో ॥ ఎను కౌగిలించేటట్లు చేస్తారు.

13. పజ్రకంటక శాల్మలి:

జంతువులతో సంగమం చేసినవారు లేక సేవించకూడాని వారిని సేవించిన వారిని ఈ నరకంలో త్రోసి వజ్రాల మేకులు గల బూరుగు చెట్టుకు కట్టి చితక బాదుతారు. చెట్టుపైకి ఎక్కించి క్రిందకు లాగుతారు.

14. వైతరణి :

పాషండ మతం పట్ల ఆసక్తి పెంచుకొని ధర్మ మార్గాన్ని పరిత్యజించినవాడు నరకంలోని వైతారిణీ నదిలో పడి పొర్లుతుంటారు. మలమూత్రాదులు, చీము, రక్తము, జుట్టు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు మాంసము, మజ్జ ప్రవహించే ఆ నైతరణీనది సరిక లోకానికి అగడ్తగా ఉంటుంది.

15. పూయాదన :

బ్రాహ్మణుడై కూడా శాచము, ఆచారము వదలి పెట్టి సిగ్గు బిడియం లేకుండా ఇతర జాతి స్త్రీలతో పశువునలే ప్రవర్తించిన వాడు పూయాచన అనే నరకంలో పడి లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో త్రోయబడి వాటినే తింటూ కాలం గడుపుతాడు.

16. ప్రాణరోధము:

కుక్కలను పెంచి, నిరంతరం వేటాడుతూ, మృగాలను చంపరాని సమయాలలో చంపుతూ వాటిని మాంసం కోసం హింసించేవాడు ప్రాణరోధం అనే నరకంలో పడి పదునైన ఆయుధాలతో పోటులను తింటారు.

17. విశసనము:

డాంబికంతో, డాబు, దర్పం కోసం పశువు లను చంపి ఆడంబరంగా యజ్ఞాలు చేసేవాడు విశసనం అనే నరకంలో పడి రంపాలతో పరపర కోయబడతాడు.

18. లాలాభక్షము :

కామంతో భార్యతోరేత పానం చేయించిన వాడు ఈ నరకంలో పడి, రేతస్సుతో కూడిన మడుగులో పడగా, ఆ రేతన్నే వానిచేత త్రాగించబడుతుంది. ఇంకా యమకింకరులు వానిచేత భీభత్సమైన పదార్థాలను భక్షింపచేస్తారు.

19. సారమేయోదనము :

లోకుల ఇండ్లు తగులబెట్టించటం, మందూమాకులు పెట్టి ఇతరులను చంపేవారిని, వజ్రాల కోరలున్న ఏడువందల ఇరవై కుక్కలు వానిని పీక్కొని భక్షణ చేసే సారమేయోదనము అనే ఈ నరకంలో పడవేస్తారు.

20. వీచి:

లంచం పుచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటి వారిని మోసగించే వానిని మరణించిన తరువాత పట్టటానికి ఆధారం ఉండని వీచి అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వాడిని పట్టుకొని బంధించి ఎత్తైన కొండ శిఖరం నుంచి క్రిందకు విసిరి వేయగా ఆ పాని అలలులేని కొలనువలె ఉన్న చట్రాతిపై పడి బాధలు అనుభవిస్తాడు.

21. అయపాకము:

సోమయాజి పెళ్లాన్ని కామించి అనుభవించిన వాణ్ణి సోమపాకమని చెప్పి దొంగచాటుగా మద్యపాన చేసిన వాడిని యమదూతలు బంధించి రొమ్ము తొక్కిపట్టి మీద మొత్తుతూ ఎర్రగా సలసల కాగే ఉక్కును నోటిలో దారు ఇది అయఃపాక నరక శిక్ష.

22. క్షారకర్ధమం :

తక్కువ జాతికి చెందినను, ఆడంబరంగా తపస్సు, దానం, విద్య, వ్యవహారాలలో తనకంటే పెద్దలు అహంకారంతో అవమానించితే అతడిని క్షారకర్ధమం (ఉప్పు కారముల బురద) అనే నరకంలో తలక్రిందులుగా వ్రేలాడదీసి అంతులేని యాతనలపాలుచేస్తారు.

23. రక్షోగణ భోజనము:

స్త్రీలుగాని, పురుషులుగాని తన ప్రాణ రక్షణార్ధం క్షుద్ర దేవతకు జంతువులను, మనుష్యులు బలి ఇస్తే, అట్టివారిని యమకింకరులు చురకత్తులతో పొడి రక్తం త్రాగుతారు. ఇది రక్షోగణభోజనం అనే నరకంలో జరుగుతుంది.

24. శూలప్రోతం:

ఊళ్ళలోను అడవులలోను ఉండే నిరపరా ధులైన జంతువులను, పశువులను, శూలాలకు గ్రుచ్చి హింసించా వారిని ఈ నరకంలో త్రోసి, శూలాలతో గ్రుచ్చి, అక్కడ అక దప్పులతో నకనకలాడుతుంటే రాబందులు, గడ్డలు పదునై తమ ముక్కులతో వారి దేహాలను పొడుచుకొని తింటుంటాయి.

25. చందశూకము:

నిర్ధాక్షిణ్యంగా నోరులేని జంతువులు వీడించే క్రూర స్వభావులైన వారిని దండశూకమనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఐదు తలలు, ఏడు తలలు గల సర్పాలు వారిని కరుస్తూ ఎలుకలను వలె మ్రింగి వేస్తుంటాయి.

26. అపట నిరోధనము:

ఇళ్ళలోగానీ పెరట్లలో గానీ తిరిగే పశువులను, పక్షులను, లేళ్ళను హింసించే వారిని అపట నిరోధనము సెగలు పొగలు నిండిన నరకంలో విసరివేసి మరలకుండా అడ్డగిస్తారు. అనే నరకంలో పడవేసి, పాపాత్ములను విషంతోను, నిప్పుతోను,

27. పర్యావర్తనము :

తన ఇంటికి వచ్చిన మనుష్యుని చీదరించుకొని, కోపోద్రేకంతో చూచిన దుర్మార్గుల కన్నులను, రాబందులు, గద్దలు పీక్కొని తింటాయి. వారు బాధలను అనుభవించే నరకాన్ని పర్యావర్తనము అంటారు.

28. సూచీముఖం:

తనకు ధనం ఉన్నదనే మదంతో, ఇతరులకు ఏ మాత్రం ఉపకారం చేయక చిన్నచూపు చూచిన వాని శరీరాన్ని యమభటుల సూదులతో బొంతలు కుట్టినట్లుగా కుడతారు. ఇవి తెలుసుకొని ప్రవర్తించినవాడు ఇహపర లోకాలలో ధన్యుడు.

Also Read :

Health Benefits of Eating Cloves : లవంగాలు తినడం వల్ల లాభాలు ఇవే..

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News