Pradakshina : పిల్లలకు ఎప్పుడూ చదువు గురించేకాదు. భక్తి గురించి కూడా చెబుతూ ఉండాలి. ఈ చరాచర సృష్టి అంతా భగవంతుడి సృష్టే కదా! కొందరు పిల్లలు గుడిలోకి రాకుండా బయటే నిలబడతారు. వారిది తెలియనితనమే !
కొందరు లోపలికి వచ్చినా ప్రదక్షిణాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రెండు చేతులతో నమస్కరిస్తే చాలదు. భగవన్నామం స్మరిస్తూ ముందుకు కదిలితేనే ప్రదక్షిణకు అర్థం ఉంటుంది.
ఏ గుడికి వెళితే ఆ దేవుని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయడం మరచిపోవద్దు. ధ్వజస్తంభం నుండే మొదలుపెట్టి ఆ ధ్వజస్తంభం దగ్గరే ముగించాలి. మీకు ఇంకో విషయం తెలుసా ?
దేవతలను బట్టి ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలో అనే లెక్క ఉంది.
వినాయకునికి – ఒక్క ప్రదక్షిణ
సూర్యునికి – రెండు ప్రదక్షిణాలు
విష్ణువుకు – నాలుగు ప్రదక్షిణాలు
శివునికి – మూడు ప్రదక్షిణాలు
ఆంజనేయునికి – ఐదు ప్రదక్షిణాలు
రావిచెట్టుకు – ఏడు ప్రదక్షిణాలు చేయాలి.
ప్రదక్షిణాలు హడావిడిగా చేయరాదు. నిదానంగా నడవాలి. ఎంత నిదానంగా నడిస్తే అంత ఫలితం ఉంటుంది.
నవగ్రహాలకు తొమ్మిదిసార్లు ప్రదక్షిణం చెయ్యాలి. ఇంటికి వెళ్ళగానే ఈ ప్రదక్షిణాలు చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవడం మరచిపోకూడదు.
also read :
Upasana : ఉపాసన డెలివరీ డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే..!
moral stories in telugu : ఇద్దరు స్నేహితులు.. కథ చదవండి..
Shruti Haasan : కాళ్లు కమిలిపోయేలా ప్రభాస్ హీరోయిన్ వర్కవుట్స్..